రానాను తిడుతున్నాడట!

టాలీవుడ్‌లో దగ్గుబాటి ఫ్యామిలీకి ప్రముఖ స్థానం ఉంది.రామానాయుడు ఎన్నో సినిమాలను నిర్మించి, స్టూడియోను ఏర్పాటు చేసి తెలుగు సినిమా అభివృద్దికి పాటు పడ్డాడు.

 Producer Scolds Rana Daggubati-TeluguStop.com

ఇక ఆయన ఇద్దరు కొడుకుల్లో సురేష్‌బాబు నిర్మాతగా మంచి గుర్తింపు తెచ్చుకోగా, వెంకటేష్‌ స్టార్‌ హీరోగా పేరు తెచ్చుకున్నాడు.ఆ ఫ్యామిలీ నుండి చాలా సంవత్సరాల క్రితం తెలుగు సినిమా పరిశ్రమకు వచ్చిన రానా మాత్రం ఇప్పటి వరకు ఒక్కటి అంటే ఒక్కటి కూడా హీరోగా కమర్షియల్‌ సక్సెస్‌ను తెచ్చుకోలేక పోయాడు.

తాజాగా ఈ విషయాన్ని రానా ఒక అవార్డు వేడుకలో తెలియజేస్తూ… తాను హీరోగా కెరీర్‌ ఆరంభించి చాలా సంవత్సరాలు అయినా ఇప్పటి వరకు ఒక్క బిగ్గెస్ట్‌ కమర్షియల్‌ సక్సెస్‌ను అందుకోలేక పోయాను.అందుకే మా నాన్న(సురేష్‌బాబు) ఒక్క హిట్‌ కూడా దక్కించుకోలేక పోయావు అంటూ తిడుతూ ఉన్నాడు.

ఇప్పటి వరకు ఒక్క సక్సెస్‌ అందుకోలేక పోయినా కూడా అవార్డులు మాత్రం కుప్పలు తెప్పలుగా వచ్చాయి అంటూ చమత్కరించాడు.ఈయన తాజాగా నటించిన ‘బాహుబలి’ సినిమా భారీ బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ను అందుకున్న విషయం తెల్సిందే.

అయితే ‘బాహుబలి’లో రానా విలన్‌గా నటించాడు.దాంతో ఆ క్రెడిట్‌ మొత్తం దర్శకుడు రాజమౌళి మరియు హీరో ప్రభాస్‌కు వెళ్లి పోయింది.

మరి రానాను సురేష్‌బాబు అభినందించే రోజు ఎప్పుడు వస్తుందో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube