ఇదేక్కడికి ట్విస్ట్.. పాక్‌లో స్వీట్లు అమ్ముకుంటున్న డొనాల్డ్ ట్రంప్ తమ్ముడు.. వీడియో చూడండి!

పాకిస్థాన్‌లోని పంజాబ్ రాష్ట్రంలో ఉన్న సాహివాల్ నగరంలో ఒక ఫుడ్ వెండర్ ఇప్పుడు సోషల్ మీడియా సెన్సేషన్ అయిపోయాడు.అతడి పేరు సలీమ్ బగ్గా.

 Donald Trump Lookalike Saleem Bagga Sings Sells Pudding Kheer In Pakistan Video-TeluguStop.com

ఈయన రుచికరమైన ఖీర్, కుల్ఫీ అమ్ముతూ చాలా ఫేమస్ అయ్యాడు.అయితే ఇతనికి ఇంత పేరు రావడానికి మరో ముఖ్యమైన కారణం ఉంది.

అదేంటంటే, అచ్చం అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌లా ఉండటమే.అతడిని చూసి చాలామంది “బహుశా ఇతడు డొనాల్డ్ ట్రంప్ కి స్వయానా తమ్ముడు అవుతాడేమో” అని ఫన్నీగా కామెంట్లు పెడుతుంటాడు.

సలీమ్ బగ్గా చూడటానికి సేమ్ టు సేమ్ డొనాల్డ్ ట్రంప్‌లా ఉంటాడు.అతడికున్న తెల్లటి జుట్టు (అల్బినిజం వల్ల వచ్చింది), ట్రంప్‌ను గుర్తు చేసే ముఖ కవళికలు అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి.

దీంతో అతనికి “ఖీర్ సెల్లింగ్ ట్రంప్” అనే క్రేజీ పేరు కూడా వచ్చేసింది.తన రంగురంగుల ఫుడ్ కార్ట్‌తో బగ్గా అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు.స్థానికులే కాదు, ఆ ఊరికి వచ్చిన వాళ్లు కూడా అతడి దగ్గర స్వీట్లు తింటూ సెల్ఫీలు దిగుతున్నారు.అంతేకాదు, కస్టమర్లను మరింత ఉత్సాహపరిచేందుకు బగ్గా పంజాబీ పాటలు కూడా అద్భుతంగా పాడుతుంటాడు.

జిస్ట్ న్యూస్ అనే సంస్థ షేర్ చేసిన ఒక వీడియోలో బగ్గా ఎంతో సంతోషంగా కస్టమర్లకు స్వీట్లు పంచుతూ కనిపించాడు.తన చుట్టూ ఇంతమంది గుమిగూడినా, రకరకాల పేర్లతో పిలుస్తున్నా బగ్గా మాత్రం చాలా సింపుల్‌గా ఉంటున్నాడు.ఈ కొత్త గుర్తింపును ఆస్వాదిస్తూ తన స్వీట్లతో, పాటలతో ప్రజలను సంతోషపెట్టడంపైనే ఆయన దృష్టి.తన వరకైతే ఈ తీపి ట్రీట్లు, చిరునవ్వుల కలయికే అసలైన సక్సెస్ ఫార్ములా అంటాడు బగ్గా.

ఈ వీడియోకి ఇప్పటికే 70 వేలకు పైగా వ్యూస్ వచ్చాయి.కామెంట్ల సెక్షన్‌లో ఒక యూజర్ బగ్గాను “పాకిస్తాన్ డొనాల్డ్ ట్రంప్” అని పిలిస్తే, మరొకరు “నిజంగా ఇతను ట్రంప్ అనుకున్నాను” అని కామెంట్ చేశారు.ఇంకొకరు అయితే “అతని వాయిస్ అద్భుతంగా ఉంది, ఎలాంటి శిక్షణ లేకుండానే ఎంత సహజంగా పాడుతున్నాడో.నిజంగా ఇంప్రెస్సివ్‌గా ఉంది.” అని మెచ్చుకున్నారు.

ఇలా డొనాల్డ్ ట్రంప్‌ను పోలిన వ్యక్తులు ఫేమస్ అవ్వడం ఇదేం మొదటిసారి కాదు.2016లో బ్రిటిష్ కమెడియన్ మైక్ ఓస్మాన్ కూడా ట్రంప్ లాగే ఉండటంతో పాపులర్ అయ్యాడు.“డొనాల్డ్ ట్రంప్డ్” అనే పేరుతో ఒక కామెడీ షో కూడా చేశాడు.ట్రంప్ నడిచే విధానం, మాట్లాడే శైలిని అచ్చుగుద్దినట్టు దించేవాడు.మైక్ ఓస్మాన్ వీడియోలు టిక్‌టాక్‌లో 16 మిలియన్ల వ్యూస్‌ను దాటాయి.దీన్ని బట్టి చూస్తే, ట్రంప్ పోలికలున్న వ్యక్తులు ప్రపంచవ్యాప్తంగా ఇంకా ఎంతలా ఆకర్షిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube