రీల్ కోసం ప్రాణాల‌తో చెల‌గాటం.. రైల్వే బ్రిడ్జిపై ఈ మూర్ఖుడు చేసిన పని చూస్తే!

సోషల్ మీడియాలో ఓ షాకింగ్ వీడియో వైరల్( Viral Video ) అవుతోంది.ఇందులో రీల్ వీడియో కోసం ఓ యువకుడు ప్రాణాలతో చెలగాటమాడుతున్నాడు.

 Biker Performs Dangerous Stunt For Reels Rides Triple Seat On Railway Bridge Vid-TeluguStop.com

నదిపై ఉన్న రైల్వే వంతెనపై( Railway Bridge ) బైక్‌పై విన్యాసాలు చేస్తూ కనిపించాడు.అతడి వెనుక ఇద్దరు కూర్చున్నారు.

అందులో ఒకరు మైనర్ అయి ఉండొచ్చని తెలుస్తోంది.

ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

రైల్వే బ్రిడ్జిపై బైక్ నడపడం( Bike Riding ) ద్వారా తనతో పాటు ప్రయాణిస్తున్న ఇతరుల ప్రాణాలను కూడా ప్రమాదంలో పడేశాడు.ఒకవేళ ఆ సమయంలో రైలు వచ్చి ఉంటే ఘోర ప్రమాదం జరిగి ఉండేది.

దీంతో సోషల్ మీడియా యూజర్లు మండిపడుతున్నారు.అతడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

ఈ వీడియోను మొదట ఇన్‌స్టాగ్రామ్‌లో @ll_ravi_thakur_ll76 అనే యూజర్ పోస్ట్ చేశాడు.ఝార్ఖండ్‌లోని( Jharkhand ) ఓ చిన్న గ్రామంలోని “బగ్లాటా బ్రిడ్జ్” దగ్గర తీసిన వీడియో అంటూ క్యాప్షన్ ఇచ్చాడు.

ఈ రీల్‌కు క్షణాల్లోనే మిలియన్ వ్యూస్‌తో పాటు 28 వేల లైకులు వచ్చాయి.

అయితే, కామెంట్లన్నీ అతడి నిర్లక్ష్యపు చేష్టలను విమర్శిస్తూనే ఉన్నాయి.కొందరు యూజర్లు అతడిని “మౌంటెన్ డ్యూ మోడ్” అంటూ వెటకారంగా కామెంట్స్ చేస్తుంటే, మరికొందరు అరెస్ట్ చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు.రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్‌పీఎఫ్) లేదా పోలీసులు అతడిపై చర్యలు తీసుకుంటారా అని చాలా మంది ప్రశ్నిస్తున్నారు.

@JharkhandRail అనే ట్విట్టర్ యూజర్ షేర్ చేసిన మరో వీడియోలో, ఆ వ్యక్తి మళ్లీ రైల్వే ట్రాక్‌లపై బైక్ నడుపుతూ కనిపించాడు.అతడు పదే పదే ఇతరుల ప్రాణాలను రిస్క్‌లో పెడుతున్నాడని ఆరోపించిన ఆ యూజర్ వెంటనే అతడిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.రైల్వే అధికారులను ట్యాగ్ చేస్తూ అతడి ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్‌ను కూడా షేర్ చేశారు.

రైల్వే ట్రాక్‌లపై ప్రయాణించడం తీవ్రమైన నేరం.దీనికి రెండేళ్ల జైలు శిక్ష, రూ.2,000 జరిమానా లేదా రెండు విధించే అవకాశం ఉంది.ఒకవేళ అతడి చర్యల వల్ల రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగిస్తే, జీవిత ఖైదు లేదా 10 ఏళ్ల వరకు జైలు శిక్షతో పాటు జరిమానా కూడా విధించవచ్చు.

యువకుడు భవిష్యత్తులో ఇలాంటి స్టంట్లు చేయకుండా ఉండేందుకు కఠినమైన శిక్షలు విధించాలని, ప్రజల భద్రతను కాపాడేందుకు చట్టాన్ని మరింత కఠినంగా అమలు చేయాల్సిన అవసరం ఉందని నెటిజన్లు చెబుతున్నారు.

ఈ ఘటన కొందరు సోషల్ మీడియా ఫేమ్ కోసం ఎంత దూరమైనా వెళ్తారనే విషయాన్ని మరోసారి రుజువు చేసింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube