ఒకప్పుడు లావాదేవీలు మొత్తం నగదు రూపంలోనే సాగేవి… కానీ, ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా డిజిటల్ పేమెంట్ల హవా కొనసాగుతోంది.స్మార్ట్ ఫోన్లు అందుబాటులోకి వచ్చాక ప్రపంచమే ఓ కుగ్రామం అయిపోయింది.
అరచేతిలో ఫోన్‌లో నగదును ప్రపంచంలోని ఎవరికైనా సెకన్లలో పంపే వెసులు బాటు ఉండడంతో లావాదేవీలు చాలా తేలిక అయిపోయాయి.ఈ క్రమంలోనే దేశవ్యాప్తంగా యూపీఐ( UPI ) ద్వారా చెల్లింపులు ఎక్కువగా నడుస్తున్నాయి.
ఇక యూపీఐ విషయానికి వస్తే, ప్రధానంగా గూగుల్ పేను( Google Pay ) చాలా మంది విరివిగా వాడుతుంటారు.అయితే ఒకప్పుడు గూగుల్ పేలో లావాదేవీలు నడిపితే నగదు బహుమతులను ఇచ్చేవారు.
కానీ ఇప్పుడు స్క్రాచ్ కార్డులను( Scratch Cards ) ఇస్తున్న సంగతి తెలిసినదే.
అయితే ఇన్నాళ్ల తరువాత మళ్ళీ గూగుల్ పేలో మళ్లీ నగదును గెలుచుకునే అవకాశాన్ని కల్పిస్తున్నారు.అవును, రూ.51 నుంచి రూ.1001 వరకు నగదును మీరు కూడా గూగుల్ పేలో గెలుచుకోవచ్చు.ఈ క్యాంపెయిన్‌ను నవంబర్ 7 నుంచి స్టార్ట్ చేస్తున్నట్టు తెలుస్తోంది.ఇందులో భాగంగా గూగుల్ పే వినియోగదారులు 6 లడ్డూలను గెలుచుకుంటే, వారికి రూ.51 నుంచి రూ.1001 మధ్యలో ఎంతైనా క్యాష్ బ్యాక్ ఎంతైనా రావద్దు.అయితే, లడ్డూలను ( Laddoos ) పొందాలంటే? వినియోగదారులు గూగుల్ పేలో చెల్లింపులు చేయాల్సి ఉంటుంది.ఇందుకు గాను భిన్న రకాలుగా లడ్డూలను పొందవచ్చు.
ఇకపోతే ఇక్కడ కొన్ని నియమనిబంధనలు తప్పనిసరి అని గుర్తు పెట్టుకోవాలి.ఎవరైనా మర్చంట్ క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసి కనీసం రూ.100 చెల్లింపు చేస్తే, లడ్డూలను గెలుచుకోవచ్చు.అలాగే మొబైల్ రీచార్జి లేదా పోస్ట్‌పెయిండ్ నంబర్ బిల్ పే అయితే కనీసం రూ.100 చెల్లిస్తే లడ్డూలు వస్తాయి.బిల్ పేమెంట్స్ విషయానికొస్తే, రూ.100, గిఫ్ట్ కార్డులను కొంటే కనీసం రూ.200 చెల్లించాలి.ఈ విధమైన ట్రాన్సాక్షన్స్ చేస్తే వచ్చే లడ్డూలకు గాను పైన చెప్పినట్లుగా రూ.51 నుంచి రూ.1001 వరకు క్యాష్ బ్యాక్ పొందే వీలుంది.అయితే ఇది ఏ మేర సక్సెస్ అవుతుందో చూడాలి మరి!
.