సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకం

రాజన్న సిరిసిల్ల జిల్లా :సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు.జాతీయ ఉపాధ్యాయ దినోత్సవాన్ని జిల్లా పాఠశాల విద్యాశాఖ ఆద్వర్యంలో జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలోని ఆడిటోరియంలో గురువారం ఘనంగా నిర్వహించారు.

 The Role Of Teachers In Society Building Is Crucial-TeluguStop.com

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్ హాజరయ్యారు.ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించారు.

ఈ సందర్భంగా ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్( Vemulawada MLA Adi Srinivas ) మాట్లాడారు.రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ స్కూళ్ళ బలోపేతానికి అన్ని చర్యలు తీసుకుంటుందని తెలిపారు.

ఖాళీల భర్తీకి ఇటీవల దాదాపు 12 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ చేసి, పరీక్ష నిర్వహించిందని గుర్తు చేశారు.పోస్టుల భర్తీకి చర్యలు తీసుకుంటుందని వెల్లడించారు.

  అమ్మ ఆదర్శ పాఠశాల కింద స్కూళ్ళలో మౌలిక వసతులు కల్పించేందుకు చర్యలు తీసుకుందని గుర్తు చేశారు.ప్రభుత్వ పాఠశాలలో పదవ తరగతి చదువుకొని 10/10 సాధించిన విద్యార్థులను ముఖ్యమంత్రి సన్మానించారని గుర్తు చేశారు.

ప్రభుత్వం, ముఖ్యమంత్రి ఉపాధ్యాయుల ప్రమోషన్స్, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారని వివరించారు.ప్రభుత్వ పాఠశాలల్లో చదివి రాష్ట్రపతి, శాస్ర్తవేత్తలు, కలెక్టర్లు, ఇంజనీర్లు ఇలా ఎదిగిన వారు ఉన్నారని గుర్తు చేశారు.

తాను ప్రభుత్వ పాఠశాలలో చదివి ఈ స్థాయికి ఎదిగానని వివరించారు.ఉత్తమ ఉపాధ్యాయులుగా అవార్డ్స్ స్వీకరించిన వారికి అభినందనలు తెలియజేశారు.

మిగితా టీచర్లు వీరిని ఆదర్శంగా తీసుకుని ఉన్నత స్థానాలకు ఎదగాలని ఆకాంక్షించారు.జిల్లా నుంచి జాతీయ స్థాయికి తాడురి సంపత్ కుమార్, రాష్ట్ర స్థాయికి పాకాల శంకర్ ఎంపిక కాగా, వారికి శుభాకాంక్షలు తెలిపారు.

విద్యార్థుల్లో సృజనాత్మకత వెలికితీసి వారు ఎంచుకున్న రంగంలో రాణిoచేలా టీచర్లు కృషి చేస్తున్నారని కొనియాడారు.ఉపాధ్యాయులు ఏమైనా సమస్యలు ఉంటే ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని విప్ కోరారు.

సామాజిక రుగ్మతల నిర్మూలనకు కృషి చేయాలని పిలుపు నిచ్చారు.అనంతరం కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మాట్లాడారు.

తన బాల్యం నుంచి ఈ స్థాయికి వచ్చేలా తీర్చిదిద్దిన టీచర్లు అందరికీ కృతజ్ఞతలు తెలిపారు.పిల్లలను అన్ని అంశాల్లో రాణించేలా తీర్చిదిద్దాలని సూచించారు.

సామాజిక, పర్యావరణ స్పృహ, నైతికత, విలువలు, పోటీతత్వం నేర్పించాలని పిలుపు నిచ్చారు.ఈ కార్యక్రమంలో సిరిసిల్ల మున్సిపల్ ఛైర్పర్సన్ జిందం కళా, సెస్ చైర్మన్ చిక్కాల రామారావు, జిల్లా విద్యాధికారి రమేష్, జీసీడీఓ పద్మజ ఎంఈఓలు, టీచర్లు తదితరులు పాల్గొన్నారు.

జిల్లాలో అవార్డ్స్ పొందిన వారు ప్రధానోపాద్యాయులు బి.సదానందం, జడ్.పి.హెచ్.ఎస్ కోనాయిపల్లి,జి.కృష్ణహారి, జడ్.పి.హెచ్.ఎస్ రాచర్ల తిమ్మాపూర్,స్కూల్ అసిస్టెంట్లు బి.గోవింద రావు, జడ్.పి.హెచ్.ఎస్ (బాలురు) సిరిసిల్ల, డి.రాజిరెడ్డి, జడ్.పి.హెచ్.ఎస్ లింగన్నపేట, కె.రవి, జడ్.పి.హెచ్.ఎస్ చంద్రంపేట,వి.వసుందర, జడ్పీహెచ్ఎస్ విలాసాగర్,డి.శరత్ కుమార్, జడ్.పి.హెచ్.ఎస్ వట్టిముల్ల, ఎన్.

నీరజ, జడ్.పి.హెచ్.ఎస్ కోనాయిపల్లి,పి.

రామచందర్ రావు, జడ్.పి.హెచ్.ఎస్ మండేపల్లి,ఎమ్.

లక్ష్మినారాయణ, జడ్.పి.హెచ్.ఎస్ అవునూర్, కె.రవి, జడ్పీహెచ్ఎస్ గంబీరావుపేట (ఉర్దు మీడియం), ఎల్ ఎఫ్ ఎల్ ప్రధానోపాద్యాయులు,ఆర్.రాజు, ఎంపీపీఎస్ బాబాజీనగర్,ఫిజికల్ డైరెక్టర్లు, పి.

ప్రభాకర్, జడ్పీహెచ్ఎస్ విలాసాగర్, టి.సురేష్, జడ్.పి.హెచ్.ఎస్ గీతానగర్,సెకండరీ గ్రేడ్ ఉపాద్యాయులు, కె.శోభారాణి, ఎంపీపీఎస్ ఎల్లారెడ్డిపేట,డి.లచ్చిరెడ్డి, ఎంపీపీఎస్ రంగంపేట, జి.శంకరయ్య, ఎంపీపీఎస్ బాబాజీనగర్, ఏ.మధు, ఎంపీపీఎస్ కనగర్తి,కె.యెల్లరెడ్డి, ఎంపీపీఎస్ సింగారం,కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయం (కేజీబీవీ ), ఎన్.శారద, కేజీబీవీ తంగళ్ళపల్లి, కె.పద్మ, కేజీబీవీ వీర్ణపల్లి,ఏ.మధులత, కేజీబీవీ వేములవాడ అర్బన్, కె.అర్చన, కేజీబీవీ ఇల్లంతకుంట,తెలంగాణ మాడల్ స్కూల్స్ (టీజీఎంఎస్ ),కె.కొండల్ రావు, టీజీఎంఎస్ కోనరావుపేట,డా.బి.బాబు, టి జి ఎం ఎస్ ఇల్లంతకుంట, తెలంగాణ రెసిడెన్సీయల్ ఏడుకేషనల్ సొసైటీ, (టీజీ ఆర్ఇఐఎస్),డి.మంజుల, టి ఎస్ ఆర్ ఈ ఐ ఎస్ నేరెళ్ళ తదితరులు అవార్డులు పొందారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube