అమెరికాలో నేపాలీ యువతి దారుణహత్య .. పోలీసుల అదుపులో భారత సంతతి వ్యక్తి

అమెరికాలో నేపాలీ విద్యార్ధినిని దారుణంగా హత్య చేసిన కేసులో భారత సంతతి వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. టెక్సాస్‌లోని( Texas ) హ్యూస్టన్‌లో 21 ఏళ్ల నేపాల్ విద్యార్ధిని మునా పాండే( Muna Pandey ) హత్య కేసులో 51 ఏళ్ల భారత సంతతి వ్యక్తి బాబీ సింగ్ షాను( Bobby Singh Shah ) అరెస్ట్ చేశారు.

 Indian-origin Man Arrested For Alleged Murder Of Nepali Student In Texas Details-TeluguStop.com

హ్యూస్టన్ కమ్యూనిటీ కాలేజీలో నర్సింగ్ విద్యార్ధిని అయినా మునా పాండే వారాంతంలో తన అపార్ట్‌మెంట్‌లో తుపాకీ గాయాలతో చనిపోయింది.

Telugu America, Bobby Shah, Houston, Indian Origin, Muna Pandey, Nepali, Texas-T

న్యూయార్క్ పోస్ట్ నివేదికల ప్రకారం.నిఘా ఫుటేజీలు , ప్రజల నుంచి వచ్చిన సమాచారాన్ని విశ్లేషించిన పోలీసులు షాను పట్టుకున్నారు.పోలీసుల దర్యాప్తులో పాండే మరణానికి దారితీసిన కారణాలు వెలుగుచూశాయి.

సీసీ కెమెరా ఫుటేజ్‌లో షా తన తుపాకీతో మృతురాలు పాండేతో పోరాడుతున్నట్లుగా ఉంది.కొద్దిసేపటి తర్వాత అతను ఆమెను బలవంతంగా లోపలికి లాక్కెళ్లాడని పోలీసులు తెలిపారు.

గుర్తు తెలియని వ్యక్తులు అందించిన సమాచారంతో అపార్ట్‌మెంట్ సిబ్బంది పాండే మృతదేహాన్ని కనుగొన్నారు.

Telugu America, Bobby Shah, Houston, Indian Origin, Muna Pandey, Nepali, Texas-T

పాండే ఒంటరిగా ఉంటోందని.ఆమె తన అపార్ట్‌మెంట్ వెలుపల సెక్యూరిటీ కెమెరాను అమర్చమని పలుమార్లు కోరిందట.పదేళ్ల క్రితం షుగర్ డాడీ వెబ్‌సైట్‌లో షాతో పరిచయం ఏర్పడటంతో.

వార్తల్లో అతని ఫోటోను చూసిన ఓ మహిళ పోలీసులకు సమాచారం అందించింది.ఈ ఘటన అధికారులకు షా నేరచరిత్రను మరింత లోతుగా పరిశోధించడానికి దోహదపడింది.

ఆమె మరణానికి దారి తీసిన పరిస్ధితులు తెలుసుకోవడానికి మృతురాలి ఫోన్ కీలక ఆధారంగా పోలీసులు భావిస్తున్నారు.అందులో ఏదో ఒక లింక్ దొరుకుతుందని దర్యాప్తు అధికారులు ఆశిస్తున్నారు.

పాండే హత్య స్థానిక కమ్యూనిటీని దిగ్భ్రాంతికి గురిచేసింది.గడిచిన వారం రోజుల్లో హ్యూస్టన్‌లో( Houston ) చనిపోయిన రెండో విద్యార్ధిని మునాలే పాండే కావడం గమనార్హం.అంతకుముందు మరో ఘటనలో రైస్ యూనివర్సిటీలో ఆండ్రియా రోడ్రిగ్జ్ అనుమానాస్పదస్థితిలో శవమై తేలింది.అయితే ఆమెది హత్యా, ఆత్మహత్యా అన్న దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube