కంటి చూపును పెంచే కొత్తిమీర.. ఎలా తీసుకుంటే మంచిది?

ప్రస్తుత రోజుల్లో పిల్లల నుంచి పండు ముసలి వరకు దాదాపు అందరూ స్మార్ట్ ఫోన్లు వినియోగిస్తున్నారు. స్క్రీన్ టైమ్‌ పెరిగే కొద్దీ కంటి సంబంధిత సమస్యలు కూడా పెరుగుతున్నాయి.

 Amazing Benefits Of Coriander Leaves For Eyes! Coriander Leaves, Coriander Leave-TeluguStop.com

కంటి చూపు తగ్గడం వల్ల పదేళ్ల పిల్లలు సైతం కళ్ళద్దాలపై ఆధారపడాల్సిన పరిస్థితి వచ్చేసింది.అందుకే కంటి ఆరోగ్యం పై ప్రత్యేక శ్రద్ధ వహించాలి.

కంటి చూపును మెరుగుపరిచే ఆహారాన్ని డైట్ లో చేర్చుకోవాలి.ఇకపోతే కంటి ఆరోగ్యానికి కొత్తిమీర( Coriander ) ఎంతో మేలు చేస్తుంది.

Telugu Cholesterol, Coriander, Eyes, Tips, Healthy Eyes, Latest-Telugu Health

కొత్తిమీర లో విటమిన్ ఎ అనేది మెండుగా ఉంటుంది.విటమిన్ ఎ కంటి ఆరోగ్యంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.కంటి చూపును పెంచడానికి, రెటీనా సరిగ్గా పనిచేయడానికి, కన్ను కొన్ని వర్ణ ద్రవ్యాలను ఉత్పత్తి చేయడానికి విటమిన్ ఎ చాలా అవసరం.అందువల్ల దృష్టిని మెరుగుపరుచుకునేందుకు కొత్తిమీరను డైట్ లో చేర్చుకోండి.

కొత్తిమీర జ్యూస్ ఆరోగ్యానికి చాలా మంచిది.అందుకోసం బ్లెండర్ తీసుకుని అందులో ఒక కప్పు ఫ్రెష్ కొత్తిమీర, ఒక స్పూన్ అల్లం ముక్కలు ( Ginger )మరియు ఒక గ్లాస్ వాటర్ వేసి మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి.

ఆపై స్టైనర్ సహాయంతో జ్యూస్ ను ఫిల్టర్ చేసుకుని తేనె కలిపి సేవించాలి.

Telugu Cholesterol, Coriander, Eyes, Tips, Healthy Eyes, Latest-Telugu Health

వారానికి రెండు సార్లు ఈ కొత్తిమీర జ్యూస్ తీసుకుంటే కనుక దృష్టి లోపాలు దూరం అవుతాయి.కంటి చూపు అద్భుతంగా పెరుగుతుంది.అంతేకాదు కొత్తిమీరలో ఐరన్ కంటెంట్ మెండుగా ఉంటుంది.

రక్తహీనతతో బాధపడేవారు కొత్తిమీర జ్యూస్ ను తీసుకుంటే ఆ సమస్య నుంచి బయటపడతారు.కొత్తిమీర లో ఉండే విటమిన్ సి మరియు శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్స్ రోగ నిరోధక వ్యవస్థను బలపరుస్తాయి.

సీజనల్ వ్యాధులతో పోరాడడానికి మన శరీరాన్ని సిద్ధం చేస్తాయి.కొత్తిమీర జ్యూస్ కొలెస్ట్రాల్ ( Cholesterol )కరిగిస్తుంది.

అధిక రక్తపోటును అదుపులోకి తెస్తుంది.కొత్తిమీరలో విటమిన్ ఇ స‌మృద్ధిగా ఉంటుంది.

అందువల్ల కొత్తిమీర జ్యూస్‌ను తీసుకుంటే చర్మం యవ్వనంగా కాంతివంతంగా మెరుస్తుంది.మొటిమల సమస్య సైతం త‌గ్గుముఖం ప‌డుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube