ఆ సినిమాతో మహేష్ పని గోవిందా అన్నారు.. కట్ చేస్తే నాలుగు రెట్ల లాభం.. ఏ మూవీ అంటే?

సినిమా ఇండస్ట్రీలో ఒక సినిమా సక్సెస్ సాధించాలంటే ఆ సక్సెస్ వెనుక ఎంతోమంది కృషి ఉంటుంది.వరుసగా రెండు ఫ్లాప్స్ ఇచ్చిన డైరెక్టర్ డైరెక్షన్ లో నటించడానికి స్టార్ హీరోలు ఆసక్తి చూపరు.

 Shocking Facts About Mahesh Babu Super Hit Movie Okkadu Details, Mahesh Babu, Ok-TeluguStop.com

ఒకవేళ స్టార్ హీరోలు నటించినా ఆ సినిమాలకు కొన్నిసార్లు బిజినెస్ విషయంలో ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి.అయితే విచిత్రం ఏంటంటే కొన్నిసార్లు అలాంటి సినిమాలే రిలీజ్ తర్వాత సంచలనాలు సృష్టిస్తుంటాయి.

అలా మహేష్ బాబు( Mahesh Babu ) సినీ కెరీర్ లో పెద్దగా అంచనాలు లేకుండా విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన సినిమాలలో ఒక్కడు సినిమా( Okkadu Movie ) ఒకటి.ఎమ్మెస్ రాజు నిర్మాతగా గుణశేఖర్ డైరెక్షన్ లో ఈ సినిమా తెరకెక్కింది.

పుల్లెల గోపీచంద్ జీవితంలోని విశేషాల ఆధారంగా గుణశేఖర్( Gunasekhar ) ఈ సినిమాను తెరకెక్కించడం గమనార్హం.ఈ సినిమాకు మొదట అతడే ఆమె సైన్యం అనే టైటిల్ ను పరిశీలించారు.

Telugu Gunasekhar, Bhoomika, Mahesh Babu, Maheshbabu, Okkadu, Raju, Tollywood-Mo

ఆ తర్వాత కబడ్డీ( Kabaddi ) అనే మరో టైటిల్ ను కూడా పరిశీలించడం జరిగింది.మేకర్స్ ఈ సినిమాకు చివరకు ఒక్కడు అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు.ఈ సినిమా మహేష్ పని గోవిందా అని కామెంట్ చేసిన వాళ్లే సినిమా విడుదలైన తర్వాత సినిమా సాధించిన ఫలితాన్ని చూసి ముక్కు మీద వేలు వేసుకున్నారు.ఈ సినిమాలోని చార్మినార్ సెట్ కోసం ఒకింత ఎక్కువ మొత్తమే ఖర్చు చేయడం గమనార్హం.

Telugu Gunasekhar, Bhoomika, Mahesh Babu, Maheshbabu, Okkadu, Raju, Tollywood-Mo

9 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా అప్పట్లోనే 39 కోట్ల రూపాయల కలెక్షన్లను సొంతం చేసుకుని బాక్సాఫీస్ వద్ద హిట్ గా నిలిచింది.మహేష్ సినీ కెరీర్ లోని బిగ్గెస్ట్ హిట్లలో ఈ సినిమా ఒకటని చెప్పడంలో సందేహం అక్కర్లేదు.ఒక్కడు సినిమాతో మాస్ ప్రేక్షకుల్లో సైతం మహేష్ బాబుకు మంచి పేరు వచ్చింది.ఈ సినిమా తర్వాత మహేష్ కెరీర్ పరంగా వెనక్కు తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube