నీట్ పై తక్షణమే సమగ్ర విచారణ జరపాలి

రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలంలోని బిఆర్ఎస్ పార్టీ( BRS party ) ఆఫీసులో మంగళవారం విలేకర్ల సమావేశం నిర్వహించడం జరిగింది.ఈ సందర్బంగా రవి గౌడ్ మాట్లాడుతూ నీట్ నిర్వహణలో జరిగిన అవకతవకల పై సమగ్ర విచారణ చేపట్టి బాద్యుల పైన కఠిన చర్యలు తీసుకోవాలని భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం రాష్ట్ర నాయకులు కంచర్ల రవి గౌడ్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

 A Thorough Inquiry Should Be Conducted Immediately On Neet-TeluguStop.com

కష్టపడి చదివి పరీక్ష రాసిన లక్షలాది మంది విద్యార్థులకు వారి తల్లితండ్రులకు భరోసా ఇవ్వాలి అని, దేశ వ్యాప్తంగా ఈ పరీక్షలో జరిగిన అవకతవకలను నిగ్గు తేల్చాలని నీట్ అక్రమాల పైన ప్రధాని మోదీ నోరు తెరువలని డిమాండ్ చేయడం జరిగింది.

గుజరాత్( Gujarat ) లో నీట్ పరీక్ష పత్రాలు అమ్ముకున్న వైనం పైన ప్రధాని ఎందుకు మాట్లాడటం లేదు అని నీట్ అక్రమాలతో తెలంగాణ విద్యార్థులకు తీవ్ర అన్యాయం జరిగింది అని ఆవేదన వ్యక్తం చేశారు.

మొదటి నుంచే నీట్ ఎంట్రెన్స్ ఎగ్జామ్ వ్యవహారం లో కేంద్ర ప్రభుత్వం అత్యంత నిర్లక్ష్య వైఖరిని అనుసరిస్తుంది అని,గతం లో ఎప్పుడు లేని విధంగా నీట్ ఎగ్జామ్ లో 67 మంది కి ఫస్ట్ ర్యాంక్ రావడం ఎన్నో రకాల అనుమానాలకు దారి తీస్తుంది అని,అందులో కూడా ఒకే సెంటర్ నుండి ఎనిమిది మంది విద్యార్థులు 720 మార్కులు సాధించడం చూస్తే పెపర్ లీకేజీ( Paper leakage ) వ్యవహారం ఏ స్థాయి లో జరిగింది అర్థం అవుతుంది అని అన్నారు.ఒక మార్కు తేడా తోనే విద్యార్థుల ర్యాంకులు మారిపోతాయి అని ఎంతో మంది అవకాశాలు కోల్పోతారని విద్యార్థులు భారీగా నష్టపోయారని, ఎడ్యుకేషన్ హబ్ గా వున్న తెలంగాణ లో కూడా 150 వరకు ఒక్క ర్యాంక్ రాకపోవడం నీట్ అక్రమాలకు అద్దం పడుతుందన్నారు.

దీని పైన ఈ రాష్ట్ర ముఖ్య మంత్రి కానీ, ఈ రాష్ట్ర ఎంపీ లు కేంద్ర మంత్రులు నోరు మెదపకపోవడం దురదృష్టం అని,అంతే కాకుండా గ్రెస్ మార్కుల విధానాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని తెలంగాణ విద్యార్థులు కూడా తీవ్రంగా నష్టపోయారు అని కేంద్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి అని భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం తరుపున డిమాండు చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు మట్టే శ్రీనివాస్ నాయకులు, నవీన్,ఒగ్గు అరవింద్,రుద్రవేనీ సుజిత్, కొడం వెంకటేష్,గౌరు రాకేష్, సుర రంజిత్,భాను నరేష్, తిరుపతి తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube