తెలంగాణలో కాంగ్రెస్( Congress in Telangana ) ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి ఏదో ఒక అడ్డంకులు ఏర్పడుతూ, పరిపాలన విషయాలపై పూర్తిగా ఫోకస్ చేసేందుకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి( CM Revanth Reddy ) అవకాశం చిక్కడం లేదు.తెలంగాణ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన ఎన్నికల హామీని అమలు చేసే విషయంలోనూ అనేక ఇబ్బందులు ఎదురయ్యాయి.
ఈ నెమధ్యంలోనే పరిపాలనపై పూర్తిస్థాయిలో దృష్టి పెట్టలేకపోయారు.ఇక ఆ అడ్డంకులన్నీ తొలగిపోవడంతో, ఇక నుంచి రోజు సచివాలయానికి రేవంత్ రెడ్డి రానున్నారు.
గత రెండు నెలలుగా ఎన్నికల కోడ్ అమలులో ఉండడంతో, సచివాలయానికి దూరంగానే రేవంత్ రెడ్డి ఉంటున్నారు.మార్చి 16 నుంచి జూన్ 6 వరకు ఎన్నికల కోడ్ అమలులో ఉండడంతో, పరిపాలన అంశాలపై దృష్టి పెట్టేందుకు అవకాశం లేకుండా పోయింది.
సమీక్షలు, సమావేశాలు నిర్వహించేందుకు అధికారులను కలిసేందుకు కూడా అనుమతి లేకపోవడంతో రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ లోని( Jubilee Hills ) తన నివాసం నుంచే ఇప్పటివరకు కార్యక్రమాలు నిర్వహిస్తూ వచ్చారు.పార్లమెంట్ ఎన్నికల ప్రచారాలు కూడా అక్కడ నుంచే నిర్వహించారు. ధాన్యం కొనుగోలు తో పాటుగా, విత్తనాలు కొరత, వర్షాలు, వరదలు, సంబంధించిన అధికారులతోనూ సమీక్షలు నిర్వహించారు.ఎన్నికల కోడ్ కొనసాగుతున్న సమయంలోనే క్యాబినెట్ సమావేశం నిర్వహించాలని భావించారు.
గత నెల 18వ తేదీన ఈసీ నుంచి ఏ సమాచారం రాకపోవడంతో అదే రోజు రాత్రి వరకు మంత్రులు అధికారులు ఎన్నికల సంఘం అనుమతి కోసం వేచి చూశారు.
మే 21న సమావేశం నిర్వహించుకునేందుకు ఎన్నికల సంఘం నుంచి అనుమతి రావడంతో, ఆ సమావేశాన్ని నిర్వహించారు.ఈ సమావేశంలో తెలంగాణ అవతరణ ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలని నిర్ణయించారు.ఎన్నికల కోడ్ ముగియడం తో ఇక పూర్తిగా పరిపాలన పైనే దృష్టి పెట్టేందుకు రేవంత్ రెడ్డి కి అవకాశం చిక్కింది.