సాధారణంగా ఈ రోజుల్లో ఉద్యోగం( Job ) దొరకడమే గగనమైపోయింది ఇక ఎక్కువ శాలరీలు అందించే ఉద్యోగాలు దొరికితే వాళ్లంతా అదృష్టవంతులు మరొకరు ఉండరు అని చెప్పవచ్చు.అయితే పశ్చిమ ఆస్ట్రేలియాలోని( Western Australia ) ఒక ఆ ప్రాంతం ఉద్యోగులు కలలో కూడా ఊహించని ఒక బంపర్ ఆఫర్ ప్రకటించింది.
ఆస్ట్రేలియాలో కారాడింగ్ అనే ఒక టౌన్ ఉంది.ఇక్కడే అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్( Administrative Officers ) జాబ్లో చేరితే ఒక్కొక్కళ్ళకి ఆరు కోట్లు ఇస్తామని ప్రకటించారు.
శాలరీ చాలా టెంప్టింగ్ గా అనిపిస్తున్నా అక్కడికి ఎవరూ వెళ్లడం లేదు.ఆ జాబు ఏంటంటే ప్రాణాలను కాపాడే డాక్టర్!( Doctor ) ఈ పట్టణంలో ఎవరూ పెద్దగా చదువుకోరు వ్యవసాయ పనుల పైనే ఆధారపడతారు.
అక్కడ ఎవరికైనా అనారోగ్యం తలెత్తితే ఈ జాబ్ లో చేరే డాక్టర్ వైద్యం చేయాల్సి ఉంటుంది.
గతంలో ఇక్కడ ఒక డాక్టర్ పని చేసేవారు.ఆయన కాంట్రాక్టు ముగియడంతో అక్కడి నుంచి వెళ్లిపోయారు.మళ్ళీ రమ్మన్నా రావడం లేదు.
దానికి ఏకైక కారణం ఏంటంటే ఈ పట్టణం అనేది ప్రపంచానికి చాలా దూరంగా ఉంటుంది.ఏదైనా కావాలంటే చాలా దూరం ప్రయాణించి తెచ్చుకోవాల్సి ఉంటుంది.
మిగతా ప్రపంచంతో కనెక్షన్లు కట్ అయిపోయినట్లే ఇక్కడి నివాసులకు అన్పిస్తుంది.అయితే అన్ని పట్టణాలలో లాగానే ఇక్కడ ఒక డాక్టర్ ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
అందుకోసమే పట్టణ పరిపాలనా అధికారులు డాక్టర్ కావాలంటూ ఒక ఉద్యోగ ప్రకటనను గత ఏడాదే ప్రచురించారు.కానీ ఇప్పటికీ ఎవరూ చేరలేదట.
ఈ ఉద్యోగ ప్రకటన( Job Notification ) ప్రకారం, డాక్టర్ జాబులో జాయిన్ అయ్యేవారు ఎలాంటి ఇంటర్వ్యూ క్లియర్ చేయాల్సిన అవసరం లేదు.మంచి పేరు, అనుభవం ఉంటే సరిపోతుంది.జాయిన్ అయిన వారికి ఉచితంగా ఇల్లు కూడా అందజేస్తారు.కనీస సౌకర్యాలను సైతం కల్పిస్తారు.అలాగే నెలకు ఒక మిలియన్ డాలర్లను జీతం గా అందజేస్తారు.ఇన్ని ఆఫర్లు అందిస్తున్నా ఇప్పటికీ ఒక్క డాక్టర్ కూడా అక్కడికి వెళ్లి జాయిన్ కాకపోవడం గమనార్హం.
ఈ ఉద్యోగ ప్రకటన గురించి తెలుసుకున్న చాలామంది ఆశ్చర్యపోతున్నారు.