చంద్రబాబు( Chandrababu ) పొలిటికల్ గా ఊహించని స్థాయిలో సక్సెస్ సాధించడానికి ఆయన వ్యూహాలు కారణమని చెప్పవచ్చు.చంద్రబాబు నాయుడుకు 2024 ఎన్నికలు ఎంతో కీలకం కాగా ఈ ఎన్నికల్లో విజయం సాధించడానికి ఆయన సరికొత్త ప్రణాళికలతో ముందుకెళ్తున్నారు.
తెలుగుదేశంలో చేరే నేతల సంఖ్య కూడా అంతకంతకూ పెరుగుతోంది.ఈ ఎన్నికల్లో గెలుపు కోసం చంద్రబాబు చతుర్ముఖ వ్యూహంతో ముందుకెళ్తున్నారు.
ఈ వ్యూహాలతో జగన్( jagan ) ను గద్దె దించడం ఖాయమని ఆయన బలంగా నమ్ముతున్నారు.పొత్తులు పెట్టుకోవడం ద్వారా మొదటి వ్యూహం ఇప్పటికే సఫలమైందని చంద్రబాబు భావిస్తున్నారు.
జనసేన, బీజేపీ( Janasena , BJP ) పొత్తు వల్ల అధికార పార్టీ వ్యతిరేక ఓట్లు చీలే ఛాన్స్ అయితే ఉండదని చంద్రబాబు భావిస్తున్నట్టు కామెంట్లు వినిపిస్తున్నాయి.అధికార పార్టీ తప్పులను ఎత్తిచూపుతూ న్యూట్రల్ ఓటర్లను ఆకట్టుకోవడంలో బాబు కొంతమేర సఫలమయ్యారు.
వైసీపీ( YCP ) వల్ల ఏపీ ప్రజలు నష్టపోయారని ప్రచారం చేయడంలో బాబు ఒకింత సక్సెస్ అయ్యారు.సూపర్ సిక్స్ పథకాల ద్వారా జగన్ ను మించిన స్కీమ్స్ ను అమలు చేయనున్నామని చంద్రబాబు ప్రచారం చేస్తున్నారు.ఈ పథకాలు ప్రజల్లోకి వెళ్తే మహిళల ఓట్లు తమ పార్టీకే వస్తాయని బాబు భావిస్తున్నారు.వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్న అధికారుల బదిలీల దిశగా బాబు అడుగులు వేస్తున్నారు.
బీజేపీతో పొత్తు వల్ల ఈ ప్రయత్నంలో చంద్రబాబుకు సులువుగానే అనుకూల ఫలితాలు వస్తున్నాయి.అయితే ఏపీలో ఈ ఎన్నికలో టఫ్ ఫైట్ ఉండబోతుందని మెజారిటీ సర్వేలు చెబుతున్నాయి.పొత్తు వల్ల చంద్రబాబుకు మేలు జరుగుతుందో చెడు జరుగుతుందో ఎన్నికల ఫలితాలు వెలువడితే తప్ప చెప్పలేము.మరోవైపు టీడీపీ తరపున పోటీ చేస్తున్న అభ్యర్థులు ఇంటింటికీ తిరిగి ప్రచారం చేస్తూ గెలుపు కోసం ఎంతో కష్టపడుతున్నారు.
ఆ ప్రయత్నాలు ఎలాంటి ఫలితాలను ఇస్తాయో చూడాల్సి ఉంది.
తాజా వార్తలు