టిడిపి, జనసేన, బిజెపి ( TDP, Janasena, BJP )పొత్తులో భాగంగా చేపట్టిన పంపకాల వ్యవహారంలో టిడిపి, జనసేనకు చెందిన చాలామంది కీలక నాయకులకే ఈసారి టిక్కెట్ దక్కలేదు.పొత్తుల భాగంగా రెండు పార్టీలు కొంతమంది కీలక నేతలను సైతం పక్కన పెట్టాయి.
టిడిపిలో సీనియర్ నాయకులుగా ఉంటూ చంద్రబాబుకు( Chandrababu ) అత్యంత సన్నిహితులుగా ముద్ర వేయించుకున్న వారికి ఈసారి టికెట్ల కేటాయింపు విషయంలో నిరాశ తప్పలేదు.ఆ జాబితాలో తాజాగా చేరిపోయారు.
టిడిపి కీలక నేత మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు.మూడో విడత అభ్యర్థుల జాబితాను ఈరోజు విడుదల చేసిన చంద్రబాబు ఆ జాబితాలో ఉమాకు అవకాశం కల్పించలేదు.
దీంతో ఇక దేవినేని ఉమ ఈ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లేనట్టుగానే అర్థమవుతుంది.టిడిపి ఇంకా ఐదు అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది.
మొదటి విడత జాబితాలో 94 ,రెండో విడత జాబితాలో 34 మంది అభ్యర్థులను ప్రకటించగా, మూడో విడత జాబితాలో 11 మందికి అవకాశం కల్పించారు.కానీ ఈ జాబితాలో దేవినేని ఉమా పేరు కనిపించలేదు.దేవినేని ఉమా వరుసగా పోటీ చేస్తూ వస్తున్న మైలవరం టికెట్ ను వైసిపి నుంచి వచ్చి టిడిపిలో చేరిన సిట్టింగ్ ఎంపీ వసంత కృష్ణ ప్రసాద్( MP Vasantha Krishna Prasad ) కు చంద్రబాబు కేటాయించారు.దీంతో దేవినేని ఉమాను పెనుమలూరు నియోజకవర్గం కు పంపిస్తారని అంతా భావించగా, అక్కడ మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాదను అభ్యర్థిగా ప్రకటించడంతో దేవినేని ఉమాకు ఇక సీటు లేనట్టే అనే విషయం క్లారిటీ వచ్చింది.
దీంతో ఈ ఎన్నికలకు దేవినేని దూరంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది.ప్రస్తుతం ఆయనకు ఎక్కడా సీటు కేటాయించే అవకాశం కనిపించడం లేదు.
వరుసగా ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన దేవినేని ఉమ( Devineni uma ) ప్రస్తుతం టిడిపిలోనే కొనసాగుతున్నారు.టిడిపికి బలమైన వాయిస్ వినిపిస్తున్నారు.ప్రతిపక్షంలో ఉన్నా ఏమాత్రం భయపడకుండా వైసిపి ప్రభుత్వం పై పోరాటాలు చేస్తూ వస్తున్నారు.అటువంటి ఉమాను చంద్రబాబు ఏ కారణంతో పక్కన పెట్టారు అనేది పార్టీలో ఎవరికి అర్థం కావడం లేదు.
అసలు ఉమ కు టికెట్ కేటాయించకుండా పక్కన పెట్టారంటే దీని వెనక ఏదో బలమైన కారణం ఉండే ఉంటుందనే అనుమానాలు టిడిపి నేతల్లోనే కలుగుతున్నాయి.