తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు( Chandrababu ) రేపు మధ్యాహ్నం ఒంటిగంటకు హైదరాబాదు నుంచి హెలికాప్టర్ లో నెల్లూరు( Nellore ) బయలుదేరనున్నారు.వెంకటగిరి నియోజకవర్గంలోని( Venkatagiri Constituency ) పెంచలకోన పుణ్యక్షేత్రాన్ని సందర్శించనున్నారు.
అక్కడ శ్రీ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకుని అనంతరం ఉండవల్లి బయలుదేరనున్నారు.తెలుగుదేశం పార్టీ నుండి పోటీ చేసే అభ్యర్థులకు సంబంధించి ఇప్పటికీ రెండు జాబితాలు విడుదల చేయడం జరిగింది.
ఇంకా 16 అసెంబ్లీ, 17 ఎంపీ అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది.ఈ జాబితాపై చంద్రబాబు కసరత్తులు చేయడం జరిగింది.2024 ఎన్నికలకు బీజేపీ… జనసేన పార్టీలతో కలిసి కూటమిగా ఏర్పడి చంద్రబాబు పోటీ చేస్తున్నారు.2014లో ఇదే కూటమి అధికారంలోకి వచ్చింది.
దీంతో 2024 ఎన్నికలలో కూడా అదే దిశగా అధికారంలోకి వచ్చే విధంగా చంద్రబాబు వ్యూహాత్మకంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు.ఈ క్రమంలో పొత్తులో భాగంగా జనసేన పార్టీకి( Janasena Party ) 21 అసెంబ్లీ స్థానాలు రెండు ఎంపీ స్థానాలు కేటాయించారు.బీజేపీకి( BJP ) 10 అసెంబ్లీ స్థానాలు ఆరు ఎంపీ స్థానాలు కేటాయించడం జరిగింది.2024 ఎన్నికలలో ఎట్టి పరిస్థితులలో విజయం సాధించాలని భావిస్తున్నారు.ఈ క్రమంలో ఎక్కడ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోకుండా జాగ్రత్తగా పడుతున్నారు.ఇదే సమయంలో స్థానిక నియోజకవర్గం సామాజిక లెక్కల ఆధారంగా వ్యూహాత్మకంగా కూటమి అభ్యర్థులను చంద్రబాబు ఎంపిక చేస్తున్నారు.
మరొక పక్క ఎన్నికల దగ్గర పడుతూ ఉండటంతో ప్రచారానికి కూడా రెడీ అవుతున్నారు.