Pawan Kalyan Uday Kiran : ఉదయ్ కిరణ్ మృతికి పవన్ కారణమన్న వైసీపీ ఎంపీ.. ఆధారాల్లేకుండా నిందలేయొద్దంటున్న ఫ్యాన్స్!

జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్( Janasena Pawan Kalyan ) ఏపీలో అతి త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రచారంలో వేగం పెంచారు.ఏపీ సీఎం జగన్ పై పవన్ ఘాటు విమర్శలు చేయగా ఆ విమర్శలు నెట్టింట హాట్ టాపిక్ అయ్యాయి.

 Ycp Mp Comments About Uday Kiran Death Details Here Goes Viral In Social Media-TeluguStop.com

అయితే వైసీపీ ఎంపీ నందిగాం సురేష్( YCP MP Nandigam Suresh ) తాజాగా పవన్ పై తీవ్రస్థాయిలో కామెంట్లు చేశారు.ఉదయ్ కిరణ్ మృతికి పవన్ కళ్యాణ్ కారణమని సంచలన ఆరోపణలు చేశారు.

సినిమా యాక్టర్ ఉదయ్ కిరణ్ ఎలా చనిపోయాడని నందిగాం సురేష్ ప్రశ్నించారు.పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాల్సి ఉందని ఆయన తెలిపారు.

ఉదయ్ కిరణ్( Hero Uday Kiran ) ను అన్ని రకాలుగా అడ్డుకుని తనకు సినిమా ఆఫర్లు రాకుండా చేసి పూర్తిగా ఒత్తిడిలోకి వెళ్లేలా చేసి ఉదయ్ కిరణ్ చనిపోవడానికి పవన్ కళ్యాణ్ కారణమయ్యారని వైసీపీ ఎంపీ నందిగాం సురేష్ వెల్లడించారు.

అయితే ఉదయ్ కిరణ్ మృతి( Uday Kiran Death )కి అసలు కారణాలు వేరని ఆయన కుటుంబ సభ్యులే ఈ విషయాలను చాలా సందర్భాల్లో వెల్లడించారని అనవసరంగా నిందలేయొద్దని పవన్ ఫ్యాన్స్( Pawan Fans ) కామెంట్లు చేస్తున్నారు.ఉదయ్ కిరణ్ మరణాన్ని రాజకీయాల కోసం వాడుకోవడం సరికాదని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.నందిగాం సురేష్ కామెంట్ల గురించి పవన్ స్పందిస్తారేమో చూడాల్సి ఉంది.

ఈ నెల 12 లేదా 13న నోటిఫికేషన్ రిలీజ్ కావచ్చని ఏప్రిల్ రెండో వారంలో ఏపీలో ఎన్నికలు( AP Elections) జరిగే అవకాశాలు ఉన్నాయని పొలిటికల్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.వైసీపీ, టీడీపీ జనసేన కూటమి( TDP Janasena Alliance ) మధ్య గట్టి పోటీ ఉండబోతుందని కామెంట్లు వినిపిస్తున్నాయి.అభ్యర్థుల ఎంపిక విషయంలో చంద్రబాబు, జగన్ ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారని తెలుస్తోంది.నోటిఫికేషన్ విడుదలైతే ప్రచారంలో వేగం మరింత పెరిగే అవకాశాలు ఉంటాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube