Pawan Kalyan Uday Kiran : ఉదయ్ కిరణ్ మృతికి పవన్ కారణమన్న వైసీపీ ఎంపీ.. ఆధారాల్లేకుండా నిందలేయొద్దంటున్న ఫ్యాన్స్!
TeluguStop.com
జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్( Janasena Pawan Kalyan ) ఏపీలో అతి త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రచారంలో వేగం పెంచారు.
ఏపీ సీఎం జగన్ పై పవన్ ఘాటు విమర్శలు చేయగా ఆ విమర్శలు నెట్టింట హాట్ టాపిక్ అయ్యాయి.
అయితే వైసీపీ ఎంపీ నందిగాం సురేష్( YCP MP Nandigam Suresh ) తాజాగా పవన్ పై తీవ్రస్థాయిలో కామెంట్లు చేశారు.
ఉదయ్ కిరణ్ మృతికి పవన్ కళ్యాణ్ కారణమని సంచలన ఆరోపణలు చేశారు.సినిమా యాక్టర్ ఉదయ్ కిరణ్ ఎలా చనిపోయాడని నందిగాం సురేష్ ప్రశ్నించారు.
పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాల్సి ఉందని ఆయన తెలిపారు.
ఉదయ్ కిరణ్( Hero Uday Kiran ) ను అన్ని రకాలుగా అడ్డుకుని తనకు సినిమా ఆఫర్లు రాకుండా చేసి పూర్తిగా ఒత్తిడిలోకి వెళ్లేలా చేసి ఉదయ్ కిరణ్ చనిపోవడానికి పవన్ కళ్యాణ్ కారణమయ్యారని వైసీపీ ఎంపీ నందిగాం సురేష్ వెల్లడించారు.
"""/"/
అయితే ఉదయ్ కిరణ్ మృతి( Uday Kiran Death )కి అసలు కారణాలు వేరని ఆయన కుటుంబ సభ్యులే ఈ విషయాలను చాలా సందర్భాల్లో వెల్లడించారని అనవసరంగా నిందలేయొద్దని పవన్ ఫ్యాన్స్( Pawan Fans ) కామెంట్లు చేస్తున్నారు.
ఉదయ్ కిరణ్ మరణాన్ని రాజకీయాల కోసం వాడుకోవడం సరికాదని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.
నందిగాం సురేష్ కామెంట్ల గురించి పవన్ స్పందిస్తారేమో చూడాల్సి ఉంది. """/"/
ఈ నెల 12 లేదా 13న నోటిఫికేషన్ రిలీజ్ కావచ్చని ఏప్రిల్ రెండో వారంలో ఏపీలో ఎన్నికలు( AP Elections) జరిగే అవకాశాలు ఉన్నాయని పొలిటికల్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
వైసీపీ, టీడీపీ జనసేన కూటమి( TDP Janasena Alliance ) మధ్య గట్టి పోటీ ఉండబోతుందని కామెంట్లు వినిపిస్తున్నాయి.
అభ్యర్థుల ఎంపిక విషయంలో చంద్రబాబు, జగన్ ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారని తెలుస్తోంది.నోటిఫికేషన్ విడుదలైతే ప్రచారంలో వేగం మరింత పెరిగే అవకాశాలు ఉంటాయి.
మాంసాహారంపై నిమ్మరసం పిండి తీసుకోవచ్చా?