ఈ ఏడాది సంక్రాంతి సందర్భంగా రిలీజ్ అయిన సూపర్ హీరో ఫిల్మ్ “హను-మాన్( Hanuman )” సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది.ప్రశాంత్ వర్మ ఈ సినిమాకి దర్శకత్వం వహించడమే కాకుండా కథ కూడా అందించాడు.రూ.20 కోట్లతో తీస్తే ఈ సినిమా ఇప్పటికే రూ.130 కోట్ల దాకా వసూలు చేసింది.ఇంకా ఈ మూవీకి రెస్పాన్స్ ఏ మాత్రం తగ్గలేదు కాబట్టి రూ.200 కోట్లు వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు.చాలా స్మాల్ బడ్జెట్ సినిమాగా రిలీజ్ అయిన ఈ మూవీ మహేష్ బాబు “గుంటూరు కారం” సినిమాని కూడా చిత్తు చేసింది.
ఈ సినిమాతో ప్రశాంత్ వర్మ( Prashant varma ) టాలీవుడ్ టాప్ డైరెక్టర్లలో ఒకడిగా మారిపోయాడు.ఈ మూవీ హిట్ అయిన సందర్భంగా ప్రశాంత్ వర్మ తాను మొత్తం 12 సూపర్ పవర్స్ ఉన్న దేవుళ్ళ పాత్రలతో సినిమాలు తీస్తానని ప్రకటించాడు.ఒక సినిమాటిక్ యూనివర్సిటీ క్రియేట్ చేస్తానని తెలిపాడు.అయితే ఈ కల సహకారం కావాలంటే ఈ డైరెక్టర్‌కు బాగా సపోర్ట్ చేసే ప్రొడక్షన్ కంపెనీ ఒకటి కావాలి.
అలానే ప్రతి సినిమా వరుసగా హిట్ అవుతూ ఉండాలి.అది అంత సులభమేమీ కాదు.ఇంగ్లీషు సంస్కృతిలో చాలా సూపర్ హీరో పాత్రలు ఉన్నాయి కాబట్టి ఆ సినిమాలను వెంటవెంటనే తీయగలిగారు.
మన భారతీయ సంస్కృతిలో కూడా సూపర్ పవర్స్ ఉన్న ఎన్నో క్యారెక్టర్లు ఉన్నాయి.కానీ సూపర్ పవర్స్ ఉన్న దేవుళ్ళ క్యారెక్టర్లు మొత్తం 12 ఎంచుకోవాలంటే కొద్దిగా కష్టమే.అతడు 12 సూపర్ పవర్స్ ఉన్న దేవుళ్లతో సినిమాలు తీస్తానని ప్రకటించాడు కానీ రాముడు, కృష్ణుడు తప్ప సూపర్ పవర్స్ ఉన్న గాడ్స్ అయితే ప్రస్తుతానికి పెద్దగా కనిపించడం లేదని కొందరు కామెంట్ చేస్తున్నారు.
భీముడు, అర్జునుడు వంటి క్యారెక్టర్స్ ఉన్నాయి కానీ వారిని దేవుడు లాగా చూపించడం కుదరదు.ప్రశాంత్ వర్మ( Prashant varma ) బుర్రలో ఏ దేవుళ్ళు ఉన్నారో తెలియాలి.హను మాన్ తర్వాత ఈ డైరెక్టర్ కృష్ణుడి సినిమా తీసే అవకాశం ఉంది.ఈ సినిమాకి “దేవకినంద వాసుదేవ( Devaki Nandana Vasudeva )” అనే టైటిల్ ఖరారు చేసినట్లు తెలుస్తోంది.
ఇక ప్రశాంత్ ఇటీవల ఆదిపురుష్ సినిమాలో దేవుళ్లను కించపరిచేలాగా చూపించారని షాకింగ్ కామెంట్లు చేస్తాడు.అయినా హనుమంతుడిని తన సినిమాలో చక్కగా చూపించినందుకు ప్రశాంత్ పై ఏ టాలీవుడ్ అభిమానులు కూడా విమర్శలు చేయలేదు.