కేవలం ఈ మూడింటితో హెయిర్ ఫాల్, చుండ్రు సమస్యలకు ఈజీగా చెక్ పెట్టొచ్చు.. తెలుసా?

అత్యంత సర్వసాధారణంగా వేధించే జుట్టు సమస్యల్లో హెయిర్ ఫాల్( Hair fall ) మరియు చుండ్రు ముందు వరుసలో ఉంటాయి.స్త్రీలే కాదు పురుషులు కూడా ఈ రెండిటితో బాగా సతమతమవుతుంటారు.

 These Three Ingredients Help To Get Rid Of Hair Fall And Dandruff! Hair Fall, Da-TeluguStop.com

వీటి నుంచి బయట పడేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు.అయితే ఈ రెండు సమస్యలకు మందారం, ఉసిరికాయ మరియు ఆవనూనెతో చాలా ఈజీగా చెక్ పెట్టవచ్చు.

మరి అందుకు వాటిని ఎలా ఉపయోగించాలి అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.

Telugu Amla, Dandruff, Care, Care Tips, Fall, Oil, Hibiscus, Latest, Mud Oil, Th

ముందుగా ఐదు నుంచి ఐదు మందారం పువ్వు( Hibiscus Flower )లు తీసుకుని వాటర్ లో శుభ్రంగా కడిగి బాగా ఎండబెట్టుకోవాలి.అలాగే ఉసిరికాయలు కూడా గింజ తొలగించి ముక్కలుగా కట్ చేసి ఎండబెట్టుకోవాలి.ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి మందపాటి గిన్నె పెట్టుకుని అందులో ఒక గ్లాస్ ఆవనూనె వేసుకోవాలి.

అలాగే అర కప్పు ఎండిన ఉసిరికాయ ముక్కలు మరియు ఎండిన మందారం పువ్వులు వేసి చిన్న మంటపై క‌నీసం 15 నిమిషాల పాటు ఉడికించాలి.ఎండిన పదార్థాలు వేయడం వల్ల ఆయిల్ ఎక్కువ రోజుల పాటు నిల్వ ఉంటుంది.

ఇక 15 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసి స్టైనర్ సహాయంతో ఆయిల్ ను ఫిల్టర్ చేసుకుని చల్లారబెట్టుకోవాలి.పూర్తిగా కూల్ అయ్యాక ఒక బాటిల్ లో స్టోర్ చేసుకోవాలి.

ఈ ఆయిల్ ను నైట్ నిద్రించే ముందు స్కాల్ప్ తో పాటు జుట్టు మొత్తానికి పట్టించి కనీసం 10 నిమిషాలైనా మసాజ్ చేసుకోవాలి.మరుసటి రోజు మైల్డ్ షాంపూతో తలస్నానం చేయాలి.

Telugu Amla, Dandruff, Care, Care Tips, Fall, Oil, Hibiscus, Latest, Mud Oil, Th

వారానికి రెండు సార్లు ఈ ఆయిల్ ను కనుక వాడితే హెయిర్ రూట్స్ స్ట్రాంగ్ గా మారతాయి.హెయిర్ ఫాల్ సమస్య దూరం అవుతుంది.జుట్టు రాలడాన్ని నిరోధించడానికి అవసరమయ్యే పోషకాలు, ఔషధ గుణాలు ఉసిరికాయ( Amla ) మందారం మరియు ఆవ నూనెలో మెండుగా ఉంటాయి.అలాగే ఈ మూడు పదార్థాలు జుట్టు ఎదుగుదలను ప్రోత్సహిస్తాయి.

అదే సమయంలో చుండ్రు ఎంత తీవ్రంగా ఉన్నా సరే కొద్ది రోజుల్లోనే పూర్తిగా తొలగిపోయేలా చేస్తాయి.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube