న్యూఇయర్ వేళ మహారాష్ట్రంలో పోలీసులు దాడులు నిర్వహించారు.ఈ మేరకు థానేలో నిర్వహించిన రేవ్ పార్టీని భగ్నం చేశారు.
వంద మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు భారీగా డ్రగ్స్, గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
ఈ క్రమంలోనే ఇద్దరు నిర్వాహకులను పోలీసులు విచారిస్తున్నారు.
థానే పోలీస్ క్రైం బ్రాంచ్ యూనిట్ నిర్వహించిన తనిఖీల్లో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి.కాగా న్యూ ఇయర్ వేడుకల నేపథ్యంలో రేవ్ పార్టీ ఏర్పాటు స్థానికంగా కలకలం చెలరేగిందని తెలుస్తోంది.