మహారాష్ట్ర థానేలో రేవ్ పార్టీ భగ్నం..!

న్యూఇయర్ వేళ మహారాష్ట్రంలో పోలీసులు దాడులు నిర్వహించారు.ఈ మేరకు థానేలో నిర్వహించిన రేవ్ పార్టీని భగ్నం చేశారు.

వంద మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు భారీగా డ్రగ్స్, గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.

ఈ క్రమంలోనే ఇద్దరు నిర్వాహకులను పోలీసులు విచారిస్తున్నారు.థానే పోలీస్ క్రైం బ్రాంచ్ యూనిట్ నిర్వహించిన తనిఖీల్లో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి.

కాగా న్యూ ఇయర్ వేడుకల నేపథ్యంలో రేవ్ పార్టీ ఏర్పాటు స్థానికంగా కలకలం చెలరేగిందని తెలుస్తోంది.

యూఎస్ కాంగ్రెస్‌లో పెరిగిన ‘సమోసా’ కాకస్ బలం .. అసలేంటిది?