టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దిగ్గజ హీరోలలో దగ్గుబాటి హీరో వెంకటేష్ ఒకరు.ఎన్నో సినిమాల్లో విజయాలు సాధిస్తూ విక్టరీ వెంకటేష్ గా పేరొందిన ఈ స్టార్ హీరో ఇటీవల “నారప్ప” సినిమాతో ప్రేక్షకులను మెప్పించాడు.
వెంకటేష్ చాలా విభినమైన సినిమాలను ఎంచుకుంటూ మొదటి నుంచి ప్రేక్షకులను అలరిస్తున్నాడు.అంతేకాదు కొత్త నటీమణులను వెండితెరకు హీరోయిన్లుగా పరిచయం చేశాడు.
వెంకటేష్( Venkatesh ) సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయమై ఆ తర్వాత స్టార్ హీరోయిన్లుగా మారిన వారందరో ఉన్నారు.వారెవరో తెలుసుకుందాం.
1 ఆర్తి అగర్వాల్ – నువ్వు నాకు నచ్చావ్
రొమాంటిక్ కామెడీ ఫిల్మ్ నువ్వు నాకు నచ్చావ్ (2001)తో ఆర్తి అగర్వాల్( Aarthi Agarwal )ను వెంకీ హీరోగా పరిచయం చేశాడు.దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ సినిమాకి కథ అందించాడు.ఈ చిత్రాన్ని కె.విజయ భాస్కర్ డైరెక్ట్ చేశాడు.ఈ సినిమా తర్వాత ఆర్తి ఏ రేంజ్ కి వెళ్ళిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
2.
ఫరా – విజేత విక్రమ్
S.S.రవిచంద్రన్ దర్శకత్వంలో వెంకటేష్ హీరోగా వచ్చిన (1987) విజేత విక్రమ్ సినిమాతో ఫరా నాజ్ హష్మీ సుపరిచితమైంది.ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ లో 1980-1990 కాలంలో బాలీవుడ్ ఇండస్ట్రీని ఒక ఊపు ఊపింది.ఈమె టబు అక్క.
3.ఖుష్బూ – కలియుగ పాండవులు
కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో వెంకటేష్ హీరోగా వచ్చిన కలియుగ పాండవులు (1986) సినిమాతో ఖుష్బూ( Khushboo ) వెండి తెరకు పరిచయమైంది.
4.రూపిణి – ఒంటరి పోరాటం
1989లో నా వెంకీ మూవీ ఒంటరి పోరాటంతో రూపిణి సినిమా డెబ్యూ ఇచ్చింది.
5.దివ్య భారతి – బొబ్బిలి రాజా
బొబ్బిలి రాజా (1990) మూవీ తో స్టార్ హీరోయిన్ దివ్యభారతి సినీ అభిమానులకు సుపరిచితురాలయింది.
6.టబు – కూలి నెం.1
కూలి నెం.1 సినిమాతో టబు సిల్వర్ స్క్రీన్ పై తొలిసారిగా కనిపించింది.
7.అపర్ణ – సుందరకాండ
రొమాంటిక్ కామెడీ ఫిలిం (1992) సుందరకాండ సినిమాతో అపర్ణ నటిగా పలకరించింది.
8.ప్రేమ – ధర్మ చక్రం
యాక్షన్ థ్రిల్లర్ ధర్మ చక్రం (1996) మూవీతో హీరోయిన్ ప్రేమ ఎంట్రీ ఇచ్చింది.
9.శిల్ప శెట్టి – సాహస వీరుడు సాగర కన్య
సాహస వీరుడు సాగర కన్య (1996)తో శిల్ప శెట్టి సినీ అభిమానులకు హాయ్ చెప్పింది.
10.అంజలి ఝవేరి – ప్రేమించుకుందాం రా
అప్పట్లో చాలామంది ప్రేక్షకులకు డ్రీమ్ గర్ల్ గా ఉన్న అంజలి ఝవేరిని కూడా వెంకటేషే పరిచయం.
ఇంకా ఇలా చెప్పుకుంటూ పోతే ప్రేమంటే ఇదేరాతో ప్రీతీ జింటా, మల్లీశ్వరితో కత్రినా, గురుతో రితికా సింగ్, లక్ష్మితో నయన తార పరిచయమయ్యారు.ఈ సినిమాల్లో వెంకటేష్ హీరో అన్న సంగతి తెలిసిందే.