తెలంగాణ రాష్ట్రం అంత తేలికగా రాలేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.త్యాగాల పునాదుల మీద తెలంగాణ ఏర్పడిందన్న ఆయన పోరాటాలతో ఏర్పడ్డ రాష్ట్రం తెలంగాణ అని తెలిపారు.
రాష్ట్రంలో ప్రజల ప్రభుత్వం ఏర్పడిందని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు.తెలంగాణ అభివృద్ధి చెందాలని సోనియా రాష్ట్రం ఇచ్చిందని పేర్కొన్నారు.
ఇందిరమ్మ రాజ్యంలో ప్రజలకు స్వేచ్ఛ ఉంటుందన్న రేవంత్ రెడ్డి అమరుల ఆకాంక్షలను నెరవేర్చడానికి ఇందిరమ్మ రాజ్యం వచ్చిందన్నారు.ఈ ప్రభుత్వంలో సామాజిక న్యాయం జరుగుతుందని పేర్కొన్నారు.
ప్రగతి భవన్ చుట్టూ ఉన్న ఇనుప కంచెలను బద్దలు కొట్టామన్నారు.ప్రజలు ప్రగతిభవన్ కు రావచ్చని తెలిపారు.
అదేవిధంగా రేపు ఉదయం ప్రజాభవన్ లో ప్రజాదర్బార్ నిర్వహిస్తామని చెప్పారు.తాము పాలకులం కాదని ప్రజా సేవకులమని తెలిపారు.