Prashanth Neel : ప్రభాస్ స్థాయి అది కాదు.. హిట్ సినిమాను కాపీ చేయాల్సిన అవసరం లేదు.. ప్రశాంత్ కామెంట్స్ వైరల్!

టాలీవుడ్ పాన్ ఇండియా హీరో ప్రభాస్ ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ బిజీ బిజీగా గడుపుతున్న విషయం తెలిసిందే.వరుస పాన్ ఇండియా మూవీలతో క్షణం కూడా తీరిక లేకుండా గడుపుతున్నారు ప్రభాస్.

 Prashanth Neel Clarify To Salaar Trailer-TeluguStop.com

ఇది ఇలా ఉంటే ప్రభాస్ తాజాగా నటించిన చిత్రం సలార్.ఈ మూవీకి కేజిఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్( Prashanth neel ) దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే.

ఇప్పటికే ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి.కోట్ల బడ్జెట్ తో నిర్మించిన ఈ మూవీ డిసెంబర్ 22న థియేటర్లలో గ్రాండ్ గా విడుదల కానుంది.

Telugu Prashanth Neel, Salaar, Salaar Trailer, Tollywood, Yash-Movie

ఇది ఇలా ఉంటే ఈ సినిమా ట్రైలర్ ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూశారు.ఇక ఎట్టకేలకు చిత్ర బృందం తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేయగా ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ స్పందన కంటే ఎక్కువగా నెగటివ్ స్పందన లభిస్తోంది.సలార్ ట్రైలర్( salaar trailer ) ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది.ఈ ట్రైలర్‌కి ప్రశంసలతోపాటు విమర్శలు కూడా ఎదురవ్వడం చర్చనీయాశంగా మారింది.ఈ ట్రైలర్‌ని చూసిన కొందరు క్రిటిక్స్‌ సినేరియా మొత్తం కేజీఎఫ్‌ తరహాలోనే ఉందని, కథ కూడా దాదాపు అలాగే ఉంటుందని, దీన్ని కేజీఎఫ్‌ 3 అనుకోవచ్చని కొన్ని విమర్శలు గుప్పించారు.

Telugu Prashanth Neel, Salaar, Salaar Trailer, Tollywood, Yash-Movie

అంతేకాకుండా ట్రైలర్ ని బట్టి చూస్తే ఈ సినిమా ఆల్మోస్ట్ కేజిఎఫ్ సినిమాలాగే ఉంటుంది కాకపోతే అందులో మదర్ సెంటిమెంట్ ఇందులో ఫ్రెండ్ కి సంబంధించి ఉంటుంది అని కామెంట్స్ చేస్తున్నారు.ఇది ఇలా ఉంటే సోషల్ మీడియాలో వినిపిస్తున్న నెగటివ్ వార్తలపై, నెగిటివ్ కామెంట్స్ పై తాజాగా దర్శకుడు ప్రశాంత్ నీల్ స్పందిస్తూ వివరణ ఇచ్చారు. కేజీఎఫ్‌ మూవీకీ సలార్‌ సినిమాకీ అస్సలు సంబంధం ఉండదు.

కేజీఎఫ్‌, సలార్‌ ఈ రెండు విభిన్న ప్రపంచాలు.ఆ రెండు ప్రపంచాలను కలపాలని కోరుకోను.

అంత సామర్థ్యం కూడా నాకు లేదు.ప్రభాస్‌( Prabhas ) అంత తేలిగ్గా కథను ఒప్పుకోరు.

ఒక హిట్‌ సినిమాను కాపీ చేయాల్సిన అవసరం ఆయనకు లేదు.ఆయన స్థాయి కూడా అది కాదు అని తెలియజేశారు ప్రశాంత్‌ నీల్‌.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube