తిరుమల తిరుపతి దేవస్థానంలో గోపూజ నిర్వహించిన విధానం ఇదే..!

ప్రస్తుతం మన దేశంలోని చాలా మంది ప్రజలు ఎంతో ఘనంగా, వైభవంగా కార్తీక మాసాన్ని( Karthika Masam ) జరుపుకుంటున్నారు.కార్తీ కమాసంలో ఉన్న ప్రతి రోజుకు ఎంతో ప్రాముఖ్యత ఉందని పండితులు చెబుతున్నారు.

 This Is How Gopuja Was Conducted In Tirumala Tirupati Devasthanam , Tirumala Ti-TeluguStop.com

కార్తీక మాసంలో ముఖ్యంగా మహిళలు ఎన్నో రకాల వ్రతాలను, పూజలను చేస్తూ ఉంటారు.అలాగే మరి కొంత మంది మహిళలు ఉపవాసం కూడా పాటిస్తూ ఉంటారు.

అలాగే కార్తీక మాసంలోని విశిష్టమైన రోజులలో తిరుమల తిరుపతి దేవస్థానంలో ( Tirumala Tirupati Devasthanam )పూజా కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉంటాయి.కార్తిక మాసంలో టిటిడి తల పెట్టిన విష్ణువు పూజలో భాగంగా బుధవారం తిరుమల వసంత మండపంలో గోపూజ శాస్త్రోక్తంగా నిర్వహించబడింది.

Telugu Devotional, Gopuja, Karthika Masam, Scholars, Srivenu-Latest News - Telug

అలాగే బుధవారం రోజు ఉదయం 8 గంటల 30 నిమిషముల నుంచి పది గంటల వరకు జరిగిన ఈ పూజా కార్యక్రమాన్ని వెంకటేశ్వర భక్తి ఛానల్ లో ప్రత్యక్ష ప్రసారం చేశారు.ఈ పూజా కార్యక్రమం ఎలా జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం.ముఖ్యంగా చెప్పాలంటే ముందుగా రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణు గోపాల స్వామి( Sri Venu Gopala Swamy ) వారిని వసంత మండపంలో కొలువుదీర్చారు.ఈ సందర్భంగా వైఖానస అగమ సలహాదారులు మోహన రంగాచార్యులు మాట్లాడుతూ సనాతన ధర్మంలో గోవుకు ఎంతో విశిష్టత ఉందని తెలిపారు.

ఇంకా చెప్పాలంటే గోపూజ పూజ( Gopuja ) ముక్కోటి దేవతల పూజాఫలంతో సమానమని తెలిపారు.

Telugu Devotional, Gopuja, Karthika Masam, Scholars, Srivenu-Latest News - Telug

అలాగే ముందుగా కార్తిక విష్ణు పూజ సంకల్పం చేసి ప్రార్థన సూక్తం విష్ణు పూజా మంత్ర పఠనం కూడా చేశారు.ఆ తర్వాత స్వామి అమ్మ వార్లకు తిరువారాధన నిర్వహించారు.ఇంకా చెప్పాలంటే ఆవు దూడకు ప్రత్యక్ష పూజలు చేసి నైవేద్యం, హారతి సమర్పించారు.

అలాగే గో ప్రదక్షిణ కూడా చేశారు.ఆ తర్వాత క్షమా ప్రార్ధన మంగళంతో ఈ పూజ ముగిసిందని ఆలయ ముఖ్య అధికారులు చెబుతున్నారు.

అలాగే తిరుమల తిరుపతి దేవస్థానంలో కార్తీక మాసంలోని ప్రత్యేకమైన రోజులలో ప్రత్యేకమైన పూజలు నిర్వహిస్తారని ఆలయ ముఖ్య అధికారులు వెల్లడించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube