Mahesh Babu : మహేష్ బాబు కారణంగానే ఇండియా వరల్డ్ కప్ గెలవలేదా…ఇలా తయారయ్యారేంట్రా బాబు?

ఇండియా వరల్డ్ కప్ మ్యాచ్ పై ప్రతి ఒక్క భారతీయుడు కూడా ఎన్నో ఆశలు అంచనాలు పెట్టుకుని ఈ మ్యాచ్ కోసం ఎదురు చూశారు.అయితే వరల్డ్ కప్ మ్యాచ్లో భాగంగా భారతీయులు కాస్త నిరుత్సాహపరిచే ఘటన చోటుచేసుకుందనే విషయం అందరికీ తెలిసిందే.

 Latest News About Mahesh Babu-TeluguStop.com

ఆస్ట్రేలియాతో వరల్డ్ కప్ ఫైనల్ లో బరిలోకి దిగినటువంటి ఇండియా మొదట బ్యాటింగ్ గెలిచినప్పటికీ అనుకున్న స్థాయిలో ఆటతీరును కనబరచలేకపోయారు.టీమ్ ఇండియాకు పిల్లర్ గా ఉన్నటువంటి ప్రధాన ఆటగాళ్లు అందరూ కూడా వెంట వెంటనే అవుట్ కావడంతో ఎంతోమంది నిరాశ వ్యక్తం చేశారు.

Telugu Australia, India Cup, Mahesh Babu, Namrata, Rohit Sharma, Tollywood, Vira

ఇండియా( India ) ఫైనల్స్ కి వెళ్లడంతో ఈసారి తప్పకుండా కప్పు మనదేనని ప్రతి ఒక్క భారతీయుడు కూడా ధీమా వ్యక్తం చేశారు.ఇక సినీ సెలబ్రిటీలు సైతం ఈసారి కప్పు మనదేనంటూ చేసిన కామెంట్స్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.ఇక మరి కొంతమంది వరల్డ్ కప్ మ్యాచ్ జరగబోతున్నటువంటి నేపథ్యంలో ఎన్నో సెంటిమెంట్లను సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ తప్పకుండా వరల్డ్ కప్ మనదేనని ఆశాభావం వ్యక్తం చేశారు.అయితే ఈసారి అనుకున్న విధంగా కాకుండా వరల్డ్ కప్ ( World Cup ) ఆస్ట్రేలియా టీం గెలిచి కప్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.

ఇలా ఫైనల్ వరకు అద్భుతమైన స్కోర్ సంపాదించి దూసుకుపోయిన టీమ్ ఇండియాకు ఫైనల్ లో చేదు అనుభవం ఎదురయింది.

Telugu Australia, India Cup, Mahesh Babu, Namrata, Rohit Sharma, Tollywood, Vira

ఇలా ఇండియాకు వరల్డ్ కప్ రాకపోవడంతో ఎంతోమంది మహేష్ బాబు ( Mahesh Babu) కారణంగానే ఇండియాకు వరల్డ్ కప్ రాలేదు అంటూ సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నారు.అసలు ఇండియా వరల్డ్ కప్ గెలవక పోవడానికి మహేష్ బాబుకి సంబంధం ఏంటి అనే విషయానికి వస్తే… విషయంలో అభిమానులంతా కూడా కొన్ని సెంటిమెంట్లను భారీగా నమ్మిన సంగతి మనకు తెలిసిందే.క్రమంలోనే 2011 వ సంవత్సరంలో ఇండియా వరల్డ్ కప్ సాధించింది ఆ సమయంలో మహేష్ బాబు తన భార్య నమ్రత(Namrata) తో కలిసి స్టేడియంకి వెళ్లి ఈ మ్యాచ్ చూసారు.

Telugu Australia, India Cup, Mahesh Babu, Namrata, Rohit Sharma, Tollywood, Vira

ఈ విధంగా మహేష్ బాబు స్టేడియంకి వెళ్లడంతోనే టీమిండియా గెలిచిందనే సెంటిమెంటుని కూడా వైరల్ చేశారు.అందుకే ఈసారి కూడా మీరు నమ్రత గారితో కలిసి వెళ్ళండి అన్నయ్య తప్పకుండా టీమిండియా గెలుస్తుంది అంటూ సోషల్ మీడియాలో పోస్టులు కూడా చేశారు.అయితే మహేష్ బాబు ఈసారి ఈ మ్యాచ్ చూడటం కోసం వెళ్లలేదు అంతేకాకుండా ఈసారి టీమిండియా ఓడిపోవడంతో మహేష్ బాబు వెళ్లి ఉంటే తప్పకుండా టీమిండియా గెలిచేదని మహేష్ బాబు నమ్రత స్టేడియంకి వెళ్లకపోవడం వల్లే టీమిండియా వరల్డ్ కప్ గెలవలేక పోయింది అంటూ కామెంట్లు చేస్తున్నారు అయితే ఈ విషయంపై మరికొందరు స్పందిస్తూ మహేష్ బాబు వెళ్లకపోతే గెలవకపోవడం ఏంటి ఎవర్రా మీరంతా ఇలా తయారయ్యారు అంటూ పలువురు ఈ విషయంపై కామెంట్స్ చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube