ప్రస్తుత కాలంలో ప్రేమ వ్యవహారాలు, వివాహేతర సంబంధాలు చాలా వరకు దారుణ హత్యలకు దారితీస్తున్నాయి.కొంతమంది చిన్న చిన్న సమస్యలను పరిష్కరించుకోకుండా నేరుగా హత్యలు చేయడానికి పాల్పడుతున్నారు.
ఈ క్రమంలోనే ఓ ప్రియురాలు ఇంట్లో ఎవరూ లేని సమయంలో ప్రియుడిని ఇంటికి పిలిచింది.సరే ప్రియురాలు పిలిచింది కదా అని ఇంటికి వెళ్లిన ఆ ప్రియుడిని దారుణంగా హతమార్చిన ఘటన మేడ్చల్ జిల్లా( Medchal District )లో చోటుచేసుకుంది.
అందుకు సంబంధించిన వివరాలు ఏమిటో చూద్దాం.వివరాల్లోకెళితే.
పేట్ బషీరాబాద్ పరిధిలో ఉండే భాగ్యలక్ష్మి కాలనీలో నివాసం ఉంటున్న కైలాష్ చౌదరి (38), ఓరారామ్ చౌదరి అనే ఇద్దరు వ్యక్తులు ఓ ఎలక్ట్రిక్ షాప్ నిర్వహిస్తున్నారు.ఈ క్రమంలోనే ఓరారామ్ చౌదరి ఇంటికి తరచూ కైలాష్ చౌదరి వస్తూ పోతూ ఉండేవాడు.
అయితే ఓరారామ్ చౌదరి భార్య సీతాదేవితో కైలాష్ చౌదరికి ఏర్పడిన పరిచయం కాస్త చివరికి అక్రమ సంబంధానికి( Extra Marital Affair ) దారితీసింది.కొంతకాలం వీరి వివాహేతర బంధం సాఫీగానే సాగింది.కొన్నేళ్ల తర్వాత సీతాదేవికి, కైలాష్ చౌదరికి మధ్య వ్యక్తిగత విభేదాలు తలెతాయి.ఇక తరచూ వీరి మధ్య గొడవలు జరుగుతూ ఉండడంతో.ఎలాగైనా కైలాష్ చౌదరి అడ్డు తొలగించుకోవాలని సీతాదేవి నిర్ణయించుకుంది.
ఇక కైలాస్ చౌదరిని హతమార్చాలని మంచి సమయం కోసం ఎదురు చూసి శనివారం రాత్రి కైలాష్ చౌదరిని ఇంటికి రావాలని సీతాదేవి కోరింది.
ప్రియురాలు ప్రేమగా పిలిచిందని ఇంటికి వచ్చిన కైలాష్ కళ్లల్లో కారం చల్లి, ఇంట్లో ఉండే సుత్తితో తలపై బాది హత్య చేసింది.
పోలీసులకు సమాచారం అందడంతో సంఘటనా స్థలాన్ని చేరుకొని పరిశీలించిన పోలీసులు మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు.
హత్య కేసు( Murder Case ) నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.