నీరు నిప్పు ఈ రెండు విభిన్నవే అయినా ఈ రెండిటికి అభినాభావ సంబంధం ఉంది అని పండితులు( Scholars ) చెబుతున్నారు.నిప్పును ఆర్పే నీరు, నిప్పు రెండు కలిసేది కార్తీక మాసంలోనే.
నీరు సర్వకోటి జీవాలకు ప్రాణదారం.నీరు లేకపోతే ఏ జీవి ప్రాణంతో ఉండదు.
అటువంటి నీటిలో కార్తిక దీపాలను వదలడం వెనుక ఉన్న విశేషమేంటో గురించి ఇప్పుడు తెలుసుకుందాం.ఆకాశం, నీరు, అగ్ని, గాలి,భూమి ఇవన్నీ పంచభూతాలు అని దాదాపు చాలా మందికి తెలుసు.
శివం-పంచభూతాత్మకం అని తెలిసినప్పుడే దీపాలు నీటిలో ఎందుకు వదిలిపెడతామనేది అర్థమవుతుందని వేద పండితులు చెబుతున్నారు.
లయకారుడైన శివుడి( Lord Shiva ) ఆజ్ఞ లేనిదే చీమకుడా కుట్టదని పెద్దవారు చెబుతూ ఉంటారు.అలాంటి శివ పురాణంలో ఎన్నో గొప్ప గొప్ప విషయాలు ఉన్నాయి.అష్టాదశ పురాణాల్లో శివ పురాణానికి ఎంతో ప్రత్యేకత ఉంది.
ఆత్మను జ్యోతి స్వరూపం అని కూడా వేద పండితులు చెబుతారు.ప్రతి మనిషిలోనూ ఆత్మ ఉంటుంది.
ఆ ఆత్మజ్యోతి స్వరూపంగా మారి భగవంతుడిని చేరుతుందంటారు.దానినే మరణం అని అంటారు.
శరీరం నుంచి ఆత్మ వేరు పడితే జరిగేది మరణమే అని నిపుణులు చెబుతున్నారు.శరీరానికి మరణం ఉంటుంది.
కానీ ఆత్మకు మరణం ఉండదని పండితులు చెబుతున్నారు.ఆత్మ జ్యోతి స్వరూపం అంటే దీపాన్ని పంచభూతాల్లో వదలడమే ఈ కార్తిక మాసంలోని విశిష్టత.
ఈ కార్తీక మాసంలోని విశిష్టత( Karthika masam ) పంచభూతాల్లో ఒకటి అయినా నీటిలో కార్తీకదీపం అంటే సాక్షాత్తు లయాకారుడైన ఈ పరమేశ్వరుడికి అంకితం ఇవ్వడమే అని చెబుతున్నారు.ఈశ్వరుడికి జ్యోతి అంటే ఎంతో ఇష్టం.అది కార్తీక మాసంలో అయితే ఇంకా ఇష్టం.పరమశివుడికి అత్యంత ఇష్టమైన కార్తీక మాసంలో దీపాలు వెలిగించి నదులలో, చెరువులలో వదిలితే పూర్వ జన్మలో చేసిన పాపాలతో పాటు ప్రస్తుత జన్మలో చేసిన పాపాలు నశించి పరమేశ్వరుడి సన్నిధికి చేరుతారని చాలామంది ప్రజలు నమ్ముతారు.
ఇలా పాపాలు నశించిన తర్వాత మళ్లీ మళ్లీ పాపాలు చేయకూడదని కూడా పండితులు చెబుతున్నారు.బ్రహ్మ ముహూర్తంలో స్నానమాచరించి త్రికరణ శుద్ధిగా కార్తిక దీపాలు నీటిలో విడిచిపెడతారు.
LATEST NEWS - TELUGU