దీపావళి పండుగ( Diwali festival )కు మరికొన్ని రోజులు మాత్రమే ఉంది.ఈ పండుగ రోజున చాలామంది లక్ష్మీదేవికి ( Goddess Lakshmi )పూజలు చేస్తూ ఉంటారు.
అలా చేయడం వల్ల ఇంట్లోకి లక్ష్మీదేవి వస్తుందని చాలామంది ప్రజలు నమ్ముతారు.ప్రతి ఒక్కరూ జీవితంలో కష్టపడేది డబ్బు సంపాదించడం కోసమే అని కచ్చితంగా చెప్పవచ్చు.
అలాంటప్పుడు ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగుపెడతాను అంటే ఎవరు మాత్రం వద్దంటారు.అయితే అందుకు దీపావళి పండుగ రోజు మనం చేసే పనులపై ఆధారపడి ఉంటుందని పండితులు చెబుతున్నారు.
ముందుగా ఇంటిని శుభ్రం చేసుకోవాలి.ఇల్లు దుమ్ము, దూళితో ఉండకుండా చూసుకోవాలి.

అక్కడితో సరిపోదు మరికొన్ని పనులు చేయడం వల్ల ఈ దీపావళికి మన ఇంటికి లక్ష్మీదేవి వస్తుంది.మరి ఆ పనుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.ముఖ్యంగా చెప్పాలంటే ఇంట్లో మొక్కలు ఉంటే పాజిటివ్ ఎనర్జీ ఎక్కువగా వస్తుంది.కాబట్టి దీపావళి రోజు కేవలం ఇల్లు శుభ్రం చేసుకోవడంతో పాటు ఇంట్లోనీ అన్ని మొక్కలు ఆరోగ్యంగా ఉన్నాయో లేదో చూసుకోవడం కూడా ఎంతో అవసరం అని పండితులు చెబుతున్నారు.
ఏమైనా మొక్కలు ఎండిపోతే వాటిని తొలగించి వాటి స్థానంలో తాజా మొక్కలను పెంచాలి.ముఖ్యంగా ఇంటికి నైరుతి ( Southwest )సమీపంలో మొక్కలు ఉంచడం ఎంతో అవసరం.
ఇంట్లోనీ దుమ్ము, ధూళిని తొలగించే సమయంలో అవసరం లేనివి, పాత వస్తువులు, పాత దుస్తులను ముందుగా తొలగించాలి.

ఇంట్లో వస్తువులు గజిబిజిగా లేకుండా ఎక్కడ వస్తువులు అక్కడ చక్కగా అలంకరించాలి.ఇల్లు శుభ్రం చేయడం అంటే ఇంట్లోనీ ప్రతి భాగాన్ని కూడా శుభ్రం చేయాలి.అలాగే ఇంట్లో ఎండిపోయిన మొక్కలు, ఇంట్లోని పాత న్యూస్ పేపర్ల కట్టలు అన్నీ ఇంట్లోనీ పాజిటివ్ ఎనర్జీని( Positive energy ) అదుపు చేస్తాయి.
కాబట్టి వాటిని ముందుగా బయటపడేయడం మంచిదని నిపుణులు చెబుతున్నారు.ఇంటిని శుభ్రం చేసే సమయంలో చాలామంది బాత్రూం రూమ్స్ ని పక్కన పెట్టేస్తూ ఉంటారు.కాబట్టి వాటిని కూడా వదలకుండా శుభ్రం చేయడం మంచిది.అంతేకాకుండా ఇంట్లోనే బెడ్ షీట్స్, కర్టెన్స్, బ్లాంకెట్స్ ని కూడా తొలగించి వాటి స్థానంలో ముందుగా శుభ్రం చేసి ఉంచుకున్న వాటిని ఏర్పాటు చేయాలి.
ఇవన్నీ శుభ్రం చేసుకుంటే ఈ దీపావళికి మీ ఇంట్లోకి లక్ష్మీదేవి వస్తుందని పండితులు చెబుతున్నారు.
DEVOTIONAL