మామూలుగా దర్శకనిర్మాతలు సినిమాలకు బాగా అడిక్ట్ అయిపోతూ ఉంటారు.అందుకే సినిమా అనేది వ్యసనం లాంటిదని అంటూ ఉంటారు.
ఒక్కసారి ఇండస్ట్రీలోకి వస్తే తిరిగి బయటకెళ్లాలి అనిపించదు.కొందరు డైరెక్టర్స్( Directors ) అయితే సినిమాపై ఉన్న పిచ్చితో కెరీర్ ఖతం అయిపోయినా సరే పిచ్చి సినిమాలు తీస్తూ ఉంటారు.
అలాంటిది బ్లాక్‌బస్టర్ హిట్ సినిమా తీసిన ఒక దర్శకుడు మాత్రం ఇండస్ట్రీని వదిలేస్తున్నట్లు ప్రకటించాడు.మరి ఆ డైరెక్టర్ సినిమా ఇండస్ట్రీని ఎందుకు వదిలేయాలి అనుకున్నాడు దాని వెనుక ఉన్న కారణం ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
తెలుగు ప్రేక్షకులకు మలయాళ సినిమా అనగానే గుర్తుకు వచ్చే సినిమా ప్రేమమ్( Premam ).సాయిపల్లవి, అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్లుగా పరిచయమైన ఈ మలయాళ మూవీ 2015లో సెన్సేషన్ క్రియేట్ చేసింది.దీనికి దర్శకత్వం వహించిన అల్ఫోన్స్ పుత్రెన్( Alphonse Puthren )కి బోలెడంత క్రేజ్ తీసుకొచ్చింది.దర్శకుడు కావడానికి ముందు పలు షార్ట్ ఫిల్మ్స్, మ్యూజిక్ వీడియోస్ తీసిన అల్ఫోన్స్ తర్వాత 2013లో నేరమ్ మూవీతో దర్శకుడిగా మారాడు.
ప్రేమమ్ సినిమాతో వేరే లెవల్ క్రేజ్ సొంతం చేసుకున్నాడు.దీని తర్వాత అవియల్ 2016, గోల్డ్ 2022,గిఫ్ట్ 2023 సినిమాలు తీశాడు.అయితే కొద్ది రోజుల ముందు అల్ఫోన్స్ ఫొటోలు కొన్ని బయటకొచ్చాయి.
వీటిలో బక్కచిక్కి పోయి, నెరిసిన గడ్డంతో కనిపించాడు.దీంతో అనారోగ్యానికి గురయ్యారా అని అందరూ అనుకున్నారు.ఇప్పుడు ఒక జబ్బుతో బాధపడుతున్నట్లు చెప్పి సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు.
ఆ జబ్బు కారణంగా దర్శకుడి కెరీర్‌కి పుల్‌స్టాప్ పెడుతున్నట్లు చెప్పుకొచ్చాడు.నా సినిమా థియేటర్ కెరీర్ ఆపేస్తున్నాను.
అటిజం స్పెక్ర్టమ్ డిజార్డర్ సమస్య( Autism Spectrum Disorder )తో బాధపడుతున్నాను.నేను ఎవరికీ భారంగా ఉండలనుకోవట్లేదు.
సాంగ్, వీడియోస్, షార్ట్ ఫిల్మ్స్ మాత్రం చేస్తాను.ఓటీటీ కంటెంట్( OTT ) కూడా చేస్తాను.
నిజానికి సినిమాలు ఆపేయాలనుకోవడం లేదు.కానీ వేరే అవకాశం లేకుండా పోయింది.
చేయలేని వాటి గురించి ప్రామిస్ చేయలేను.అనారోగ్యం ఉన్నప్పుడు జీవితంలో ఇంటర్వెల్ పంచ్ లాంటి ట్విస్ట్ ఇలా వస్తుంది అని అల్ఫోన్ రాసుకొచ్చాడు.
అయితే ఈ పోస్ట్ చేసిన కాసేపటికి డిలీట్ చేసారు అల్ఫోన్.