గతంలో అధికారం ఇస్తే ఏం చేశారు..: కేసీఆర్

ఎన్నికల ప్రచారంలో భాగంగా సూర్యాపేట జిల్లాలోని కోదాడలో బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభ నిర్వహించింది.ఈ సభకు హాజరైన గులాబీ బాస్ కీలక వ్యాఖ్యలు చేశారు.

 What Did You Do If You Were Given The Power In The Past..: Kcr-TeluguStop.com

ఎన్నికలు వచ్చినప్పుడు విజ్ఞతతో ఆలోచించాలని ప్రజలకు కేసీఆర్ సూచించారు.ఓటు మన తలరాతను మారస్తుందన్న ఆయన ప్రతి ఒక్కరూ ఆలోచించి ఓటు వేయాలన్నారు.

ప్రజలను నమ్ముకునే తెలంగాణ ఉద్యమం చేపట్టానన్న కేసీఆర్ ప్రజాస్వామ్యంలో ఓటును మించిన శక్తి లేదని చెప్పారు.గోల్ మాల్ చేసి దిగువకు నాగార్జున సాగర్ కట్టారన్నారు.

అందుకే తెలంగాణకు నీరు రావడం లేదని పేర్కొన్నారు.ప్రతిపక్షాలను ఉద్దేశిస్తూ గతంలో అధికారం ఇస్తే ఏం చేశారని ప్రశ్నించారు.

కాళేశ్వరం నీళ్లు వస్తే కోదాడకు కరువు రాదని చెప్పారు.ఈ క్రమంలో కోదాడలో బీఆర్ఎస్ విజయబావుటా ఎగరవేయాలని కోరారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube