గతంలో అధికారం ఇస్తే ఏం చేశారు..: కేసీఆర్
TeluguStop.com

ఎన్నికల ప్రచారంలో భాగంగా సూర్యాపేట జిల్లాలోని కోదాడలో బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభ నిర్వహించింది.


ఈ సభకు హాజరైన గులాబీ బాస్ కీలక వ్యాఖ్యలు చేశారు.ఎన్నికలు వచ్చినప్పుడు విజ్ఞతతో ఆలోచించాలని ప్రజలకు కేసీఆర్ సూచించారు.


ఓటు మన తలరాతను మారస్తుందన్న ఆయన ప్రతి ఒక్కరూ ఆలోచించి ఓటు వేయాలన్నారు.
ప్రజలను నమ్ముకునే తెలంగాణ ఉద్యమం చేపట్టానన్న కేసీఆర్ ప్రజాస్వామ్యంలో ఓటును మించిన శక్తి లేదని చెప్పారు.
గోల్ మాల్ చేసి దిగువకు నాగార్జున సాగర్ కట్టారన్నారు.అందుకే తెలంగాణకు నీరు రావడం లేదని పేర్కొన్నారు.
ప్రతిపక్షాలను ఉద్దేశిస్తూ గతంలో అధికారం ఇస్తే ఏం చేశారని ప్రశ్నించారు.కాళేశ్వరం నీళ్లు వస్తే కోదాడకు కరువు రాదని చెప్పారు.
ఈ క్రమంలో కోదాడలో బీఆర్ఎస్ విజయబావుటా ఎగరవేయాలని కోరారు.