మన భారతదేశంలోని అత్యంత విశిష్టమైన దేవాలయాలలో ఒడిశాలోని పూరి జగన్నాథ దేవాలయం( Puri Jagannath Temple ) ఒకటి అని ఖచ్చితంగా చెప్పవచ్చు.ఎందుకంటే ప్రతి సంవత్సరం ఈ దేవాలయాన్ని లక్షలాదిమంది భక్తులు దర్శించుకుంటూ ఉంటారు.
ఈ దేవాలయంలో శ్రీకృష్ణుడు,తన అన్న బలభద్రుడు,చెల్లెలు సుభద్ర దేవితో కలిసి దర్శనమిస్తాడు.ఈ దేవాలయం చాలా ప్రసిద్ధమైనది.
రోజులో ఏ సమయంలో చూసినా,అలాగే ఆకాశంలో సూర్యుడు ఎక్కడ ప్రకాశిస్తున్న దేవాలయం నీడ మాత్రం కనిపించదు.ఇది ఈ దేవాలయ నిర్మాణంలోని అద్భుతం అని కొంతమంది చెబుతూ ఉంటే,మరి కొంతమంది ఆ అద్భుతం దేవుని మహిమ అని చెబుతూ ఉన్నారు.
జగన్నాధుని మహాప్రసాదం గురించి ఎంత చెప్పినా తక్కువే అని భక్తులు చెబుతున్నారు.
ప్రతి రోజు ఐదు సార్లు జగన్నాధునికి ప్రసాదాన్ని నివేదిస్తారు.ఇక పండుగ సమయంలో 56 నుంచి 64 పిండి వంటకాలు వండుతారు.ఇలాగే ప్రసాదాన్ని చేసి ఆ దేవా దేవునికి సమర్పిస్తున్నారు.
ఈ ప్రసాదంలో దాదాపు అన్ని రకాల పదార్థాలు కలిపి వండుతారు.కానీ బంగాళాదుంపలు,టమోటోలు కలిపి అసలు వండరు.
వీటిని విదేశీ వస్తువులుగా భావిస్తారు.బంగాళాదుంపలు మన దేశానికి చెందినవి కాదని పెరూలో పండాయని నమ్ముతారు.
అలాగే టమోటోలు స్వదేశీ పంట కాదని భావిస్తారు.వీటితో పాటు క్యాబేజీ,కాలీఫ్లవర్ కూడా విదేశీ పంటలుగానే భావిస్తారు.
అందుకే వాటిని కూడా ప్రసాదాలలో కలవకుండా చూసుకుంటారు.ఉల్లి, వెల్లుల్లి( Onion garlic ) కూడా ప్రసాదాలలో ఉపయోగించడం నిషేధించారు.
ఇంకా చెప్పాలంటే మహా ప్రసాదం తయారీ చాలా ముఖ్యమైనది.ప్రసాదం వండడం కూడా వెరైటీగా ఉంటుంది.ఒక కుండపై మరో కుండ పెట్టి నిలువుగా నిలబెడతారు.అలా ఏడు మట్టికుండలను నిలబెడతారు.కట్టెల పొయ్యి మీదే ప్రసాదన్ని తయారు చేస్తారు.పై భాగంలో ఉన్న కుండలో మొదట వండుతారు.
ఆ తర్వాత మిగిలినవి వండుతారు.ఇక్కడ వంట ను లక్ష్మీదేవి ( Goddess Lakshmi )పర్యవేక్షిస్తుందని భక్తులు నమ్ముతారు.
అందుకే చాలా పవిత్రంగా వంట చేస్తారు.దాదాపు 500 మంది కలిపి వంటకాలు, వారికి సహాయంగా 300 మంది సహాయకులు ఉంటారు.
DEVOTIONAL