వణికిపోయా.. అతని టార్గెట్ నా తలపాగాయే : విద్వేషదాడి తర్వాత సిక్కు యువకుడి స్పందన

అమెరికా వాణిజ్య రాజధాని న్యూయార్క్‌లోని( New York ) సిటీ బస్సులో ఓ సిక్కు యువకుడు( Sikh ) దాడికి గురైన ఘటన తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే.దీనిని విద్వేష దాడిగా పరిగణనలోనికి తీసుకున్న న్యూయార్క్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

 Sikh Youth Who Was Assaulted In New York Bus Says Shaken As His Turban Was Speci-TeluguStop.com

ఈ ఘటనపై 19 ఏళ్ల బాధితుడు మీడియాతో మాట్లాడుతూ.రూపం , వస్త్రధారణను బట్టి ఎవరూ వేధింపులకు గురికావొద్దన్నారు.

ఈ దాడితో తాను వణికిపోయానని.ప్రతి ఒక్కరూ శాంతియుతంగా తమ వ్యాపారాన్ని కొనసాగించాలని ఆ యువకుడు ఆకాంక్షించాడు.

ఈ సమయంలో తన గోప్యతను కాపాడాలనుకుంటున్నానని.తనకు మద్ధతుగా మాట్లాడిన ప్రతి ఒక్కరికీ , ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్న అధికారులకు అతను ధన్యవాదాలు తెలిపాడు.

Telugu Amreensingh, York, York Mta Bus, Sikh, Sikh Assault, Turban-Telugu NRI

బాధితుడికి న్యాయ సహాయం అందించేందుకు అతనితోనూ, న్యూయార్క్ పోలీస్ డిపార్ట్‌మెంట్‌తోనూ టచ్‌లో వున్నట్లు ‘‘ The Sikh Coalition’’ తెలిపింది.ఈ సంస్థకు స్టాఫ్ అటార్నీగా వ్యవహరిస్తున్న అమ్రీన్ పర్తాప్ సింగ్ భాసిన్( Amreen Partap Singh Bhasin ) మాట్లాడుతూ.బాధితుడి తలపాగాను( Turban ) లక్ష్యంగా చేసుకుని ఈ దాడి జరిగిందన్నారు.జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో జరుగుతున్న ఘటనలు సిక్కు, ఇతర వర్గాలలో ఆందోళనకర వాతావరణానికి కారణమవుతున్నాయని భాసిన్ అభిప్రాయపడ్డారు.

ఇల్లినాయిస్‌లో ఆరేళ్ల పాలస్తీన్ అమెరికన్ బాలుడు వడయా అల్ ఫాయౌమ్( Wadea Al-Fayoume ) హత్యను కూడా ఆమె ఈ సందర్భంగా గుర్తుచేశారు.ఇజ్రాయెల్-పాలస్తీనా ఉద్రిక్తతల మధ్య ఈ చిన్నారిని అత్యంత కిరాతకంగా 26 సార్లు పొడిచి పొడిచి చంపారు.

ఏది ఏమైనప్పటికీ సిక్కులు ఎక్కువగా ఇలాంటి దాడులకు గురయ్యే ప్రమాదం వుందని, ఎఫ్‌బీఐ విడుదల చేసిన ద్వేషపూరిత నేరాల డేటాను భాసిన్ ఉదహరించారు.

Telugu Amreensingh, York, York Mta Bus, Sikh, Sikh Assault, Turban-Telugu NRI

కాగా.న్యూయార్క్ నగరంలోని మెట్రోపాలిటిన్ ట్రాన్స్‌పోర్టేషన్ అథారిటీ (ఎంటీఏ) బస్సులో ఒక వ్యక్తి 19 ఏళ్ల సిక్కు యువకుడిపై భౌతికదాడికి దిగడమే కాకుండా.అతని తలపాగాను తొలగించేందుకు యత్నించాడు.

ఈ ఇద్దరు వ్యక్తులు ఆదివారం ఉదయం రిచ్‌మండ్ హిల్‌లోని లిబర్టీ అవెన్యూ సమీపంలో షటిల్ బస్సులో ప్రయాణిస్తున్నారని పోలీసులు తెలిపారు.యువకుడిపై దాడి చేసిన అనంతరం నిందితుడు బస్సు దిగి పారిపోయాడు.

ఈ ఘటనపై సమాచారం అందుకున్న న్యూయార్క్ సిటీ పోలీస్ డిపార్ట్‌మెంట్ రంగంలోకి దిగింది.నిందితుడి ఆచూకీని కనుగొనేందుకు సహాయం చేయాలని ప్రజలను కోరింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube