ఏపీలో భూ హక్కు -భూ రక్షపై కేబినెట్ సబ్ కమిటీ భేటీ అయింది.ఈ మేరకు పథకం అమలును మంత్రులు పెద్దిరెడ్డి, బొత్స, ధర్మాన సమీక్షించారు.
ఇందులో భాగంగా పథకం అమలుపై సంబంధిత శాఖల ఉన్నతాధికారులతో మంత్రుల సబ్ కమిటీ సమీక్ష నిర్వహించింది.అయితే వచ్చే ఏడాది జనవరి నాటికి మూడో దశ సర్వే పూర్తి కానుంది.
కాగా రెండు దశల్లో ఇప్పటివరకు నాలుగు వేల గ్రామాల్లో సర్వే పూర్తయిన సంగతి తెలిసిందే.ఏపీ వ్యాప్తంగా 13,072 గ్రామాల్లో డ్రోన్ సర్వే పూర్తయిందని మంత్రుల కమిటీ తెలిపింది.
దేశంలోనే అత్యంత వేగంగా సమగ్ర సర్వే ఏపీలో జరుగుతోందన్న సబ్ కమిటీ సర్వే పూర్తి చేసిన గ్రామాల్లో భూహక్కు పత్రాలను పంపిణీ చేసినట్లు పేర్కొంది.ఇప్పటికే సమగ్ర సర్వేలో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో గ్రామకంఠం భూముల్లో నివాసితులకు న్యాయం జరిగేలా ఏపీ ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంటుందని వెల్లడించింది.