'బిగ్ బాస్ 7'లో మాస్ రాజా.. ఈ రోజు వీకెండ్ ఎపిసోడ్ లో రచ్చ రచ్చే!

బిగ్ బాస్ అంటే ప్రేక్షకులకు ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.మరి తెలుగులో కూడా బిగ్ బాస్ స్టార్ట్ అయ్యి 6 సీజన్స్ ముగించుకున్న విషయం తెలిసిందే.

 Mass Maharaja Raviteja On Bigg Boss 7 Telugu, Ravi Teja, Tiger Nageswara Rao, Bi-TeluguStop.com

ఇక 7వ సీజన్ ఈ మధ్యనే స్టార్ట్ అయ్యింది.గత సీజన్ ప్లాప్ అవ్వడంతో ఈసారి అన్ని పగడ్బందీగా ప్లాన్ చేసి సీజన్ 7 ను సెప్టెంబర్ 3న గ్రాండ్ గా అట్టహాసంగా స్టార్ట్ చేసింది.

ఈసారి కూడా హోస్ట్ గా నాగార్జుననే చేస్తుండగా హౌస్ లోకి 14 మంది కంటెస్టెంట్స్ ఎంట్రీ ఇచ్చారు.ఇప్పటికే నాలుగు వారాలు పూర్తి కూడా చేసుకుని ఐదవ వారం కూడా వీకెండ్ కు వచ్చింది.

అప్పుడే శనివారం ఎపిసోడ్ పూర్తి అవ్వడంతో ఆదివారం ఎపిసోడ్ కోసం అంతా ఎదురు చూస్తున్నారు.మరి తాజాగా ఈ ఆదివారం ఎపిసోడ్ లో ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు ఉన్నట్టు తెలుస్తుంది.

ఈ వీకెండ్ ఎపిసోడ్ లో మాస్ రాజా రవితేజ అడుగు పెట్టినట్టు తెలుస్తుంది.రవితేజ ప్రజెంట్ చేసిన ‘టైగర్ నాగేశ్వరరావు’ సినిమా దసరా కానుకగా రిలీజ్ కాబోతున్న విషయం తెలిసిందే.నూతన డైరెక్టర్ వంశీ దర్శకత్వంలో భారీ స్థాయిలో తెరకెక్కిన ఈ సినిమాలో నుపుర్ సనన్, గాయత్రీ భరద్వాజ్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.ఈ సినిమాకు జివి ప్రకాష్ కుమార్ స్వరాలు అందిస్తుండగా అక్టోబర్ 20న గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది.

ఇక ఈ సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడడంతో మాస్ రాజా తనదైన శైలిలో ప్రొమోషన్స్ చేస్తున్నాడు.ఈ క్రమంలోనే ఈయన బిగ్ బాస్ హౌస్ లోకి రావడం వైరల్ అయ్యింది.రవితేజ, నాగార్జున తో బిగ్ బాస్ లో కలిసి మాట్లాడడం, మాస్ రాజా స్టేజ్ మీద డ్యాన్స్ చేస్తున్న వీడియో నెట్టింట వైరల్ అయ్యింది.ఇప్పటికే షూట్ పూర్తి అయిన ఈ ఎపిసోడ్ కు సంబంధించిన పిక్స్ నెట్టింట వైరల్ అవుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube