నేడు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబును( Chandrababu ) రాజమండ్రి సెంట్రల్ జైల్లో నారా లోకేష్ ( Nara Lokesh )ములాఖత్ ద్వారా కలుసుకున్నారు.ఈ క్రమంలో లోకేష్ తో పాటు భువనేశ్వరి, నారా బ్రాహ్మణి కూడా కలవడం జరిగింది.
చంద్రబాబుతో భేటీ అనంతరం జైలు బయట లోకేష్ మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు.వ్యవస్థలను మేనేజ్ చేసి చంద్రబాబును రిమాండ్ కు పంపారని ఆరోపించారు.
దొంగ కేసు బనాయించి చంద్రబాబుని జ్యుడీషియల్ రిమాండ్ కు పంపి నేటితో 28 రోజులని వెల్లడించారు.ఆయనను అరెస్టు చేసే ముందు ₹3000 కోట్ల కుంభకోణం అన్నారు.
తర్వాత ₹371 కోట్లు అని అన్నారు.నిన్న కోర్టులో ₹27 కోట్ల అవినీతి జరిగిందని మళ్లీ మాట మార్చారు అంటూ లోకేష్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
ఇదే సమయంలో జైలులో నక్సల్స్ కొంతమంది ఖైదీలుగా ఉన్నారని చంద్రబాబు భద్రతపై తమకు ఆందోళన ఉందని తెలిపారు.అంతేకాకుండా జైల్లో గంజాయి అమ్మేవారు ఉన్నారని, జైలు పై డ్రోన్లు ఎగరవేస్తున్నారని ఆరోపించారు.
అంతేకాకుండా జైల్లో చంద్రబాబు అధైర్య పడటం లేదని పోరాటం కొనసాగించాలని తమకు తెలియజేసినట్లు స్పష్టం చేశారు.న్యాయం కాస్త ఆలస్యమైన తమ వైపే ఉంటుందని నమ్మకం ఉందని లోకేష్ చెప్పుకొచ్చారు.ఇదే సమయంలో వైసీపీ పై పోరాటం ఆగదని కొనసాగిస్తామని అన్నారు.“బాబుతో నేను” అనే కార్యక్రమం ద్వారా రాష్ట్రంలో ప్రతి ఇంటికి వెళ్లి చంద్రబాబుకి జరిగిన అన్యాయాన్ని వివరిస్తామని లోకేష్ చెప్పుకొచ్చారు.