సినిమా ఇండస్ట్రీలో కొంతమంది హీరోల సినిమాలు బాగున్నప్పటికీ అవి సక్సెస్ ఫుల్ సినిమాలు కావు మరి కొన్ని సినిమాలు చూడడానికి ఏం బాగుండవు అయినా కూడా అవి సక్సెస్ ఫుల్ సినిమాలు గా మంచి పేరు సాధించుకుంటాయి.ఇలాంటి సినిమాలు తెలుగులో కూడా కొన్ని ఉన్నాయి అవి ఏంటంటే.
మహేష్ బాబు హీరోగా వచ్చిన మహర్షి సినిమా( Maharshi movie ) అంత పెద్దగా నచ్చదు కానీ సూపర్ డూపర్ హిట్ అయింది.ఆ సినిమా చూస్తున్నంత సేపు మహేష్ బాబు గత సినిమాలు అయిన శ్రీమంతుడు, భరత్ అను నేను సినిమాలు చూసినట్టు గా అనిపిస్తుంది అయినప్పటికీ జనాలు ఆ సినిమాని అంత హిట్ చేశారు ఆ సినిమా లో సీన్లు కూడా మరి రొటీన్ గా ఉంటాయి.
క్రిష్ డైరెక్షన్ లో బాలయ్య హీరోగా వచ్చిన గౌతమీపుత్ర శాతకర్ణి సినిమా( Gautamiputra Satakarni movie ) కూడా చూడ్డానికి చాలా బోరింగ్ గా ఉంటుంది.ఆ సినిమాలో డైలాగ్స్ ని మినహాయిస్తే పెద్దగా ఏమీ ఉండదు ఆ స్టోరీ కూడా చాలా బోరింగ్ గా ఉంటుంది.కానీ ఆ సినిమా అప్పటి వరకు బాలయ్య బాబు కెరియర్ లో ఫస్ట్ టైం 50 కోట్లు సాధించిన సినిమాగా హిస్టరీ క్రియేట్ చేసింది.పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన భీమ్లా నాయక్ ( Bhimla Naik )సినిమా కూడా సగటు ప్రేక్షకుడికి అంత పెద్దగా నచ్చదు.
వాస్తవానికి ఆ సినిమా మలయాళం సినిమా అయిన అయ్యప్పనం కోషియన్ సినిమాకి రీమేక్ గా వచ్చినప్పటికీ ఆ సినిమా ప్రేక్షకుల్ని మెప్పించడంలో సక్సెస్ అయింది.అయినప్పటికీ సగటు ప్రేక్షకులు ఈ సినిమాని ఇష్టపడటం లేదు.
పవన్ కళ్యాణ్ సినిమాలో ఉండే మ్యాజిక్ ఈ సినిమాలో మిస్ అయిందని చాలామంది చెప్తూ ఉంటారు…ఇలా ఇండస్ట్రీ లో కొంత మందికి ఆ సినిమా నచ్చకపోయినా కూడా సూపర్ హిట్ అయిన సినిమాలు ఇవే…
.