మహేష్ జక్కన్న కంటే ముందే మరో మూవీ చేయనున్నాడా?

సూపర్ స్టార్ మహేష్ బాబు( Mahesh babu ) మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కిస్తున్నాడు.ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుండగా హారిక హాసిని బ్యానర్ పై ఎస్ రాధాకృష్ణ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.

 Mahesh Babu Doing Another Film Before A Rajamouli Film, Ssmb29, Mahesh Babu, Gun-TeluguStop.com

థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 13న రిలీజ్ కానుంది.ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ సినిమా తర్వాత మరో భారీ మూవీ లైన్లో పెట్టుకున్న విషయం తెలిసిందే.రౌద్రం రణం రుధిరం వంటి సినిమాను తెరకెక్కించి గ్లోబల్ వైడ్ గా పేరు తెచ్చుకున్న దర్శక ధీరుడు రాజమౌళి( Rajamouli ) దర్శకత్వంలో మహేష్ నెక్స్ట్ సినిమా చేయనున్నాడు.ప్రెజెంట్ ఈ సినిమా కోసం స్క్రిప్ట్ వర్క్ సిద్ధం చేస్తున్నారు.

రాజమౌళి – మహేష్ కాంబోలో భారీ యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్ రాబోతుండగా ఇది మహేష్ కెరీర్ లో 29వ సినిమాగా నిలిచి పోనుంది.అయితే ఈ క్రమంలోనే నెట్టింట ఒక బజ్ వైరల్ అవుతుంది.

మహేష్ రాజమౌళి కంటే ముందే మరో సినిమాను చేయబోతున్నాడు అనే టాక్ ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతుంది.

ఈ రూమర్స్ గతంలో కూడా రాగా ఇప్పుడు ఆ వార్తలను మరింత స్ట్రాంగ్ గా వినిపిస్తున్నాయి.మహేష్ బాబు రాజమౌళితో సినిమా స్టార్ట్ చేసే ముందే మరో సినిమాను లైన్లో పెట్టి ఫాస్ట్ గా కంప్లీట్ చేయనున్నారని అది కూడా అనిల్ రావిపూడితో( Anil Ravipudi ) సినిమా ఉండే అవకాశం ఉందని తెలుస్తుంది.మరి ఈ ప్రాజెక్ట్ పై అఫిషియల్ గా అనౌన్స్ మెంట్ వస్తే కానీ అసలు విషయం తెలియదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube