స్కంద మూవీ టార్గెట్ అన్ని రూ.కోట్లా.. ఈ స్థాయిలో కలెక్షన్లు రామ్ కు సాధ్యమేనా?

బోయపాటి శ్రీను రామ్( Ram pothineni ) కాంబో మూవీ స్కంద రిలీజ్ కు మరో రెండు రోజుల సమయం మాత్రమే ఉంది.ఈ సినిమా భారీ టార్గెట్ తో థియేటర్లలో విడుదలవుతోంది.

 Ram Pothineni Skanda Movie Business Target Details Here Goes Viral In Social Me-TeluguStop.com

ఈ సినిమాకు 50 కోట్ల రూపాయల రేంజ్ లో బిజినెస్ జరగగా రామ్ సినీ కెరీర్ లో ఇదే హైయెస్ట్ టార్గెట్ కావడం గమనార్హం.బోయపాటి శ్రీను ( Boyapati Srinu )ఈ సినిమాకు దర్శకుడు కావడం వల్ల ఈ రేంజ్ లో టార్గెట్ ఫిక్స్ అయింది.

విడుదలకు ముందే ఈ సినిమా నిర్మాతలకు మంచి లాభాలను అందించింది.

పాన్ ఇండియా మూవీగా ఈ సినిమా విడుదలవుతూ ఉండగా ఇతర భాషల్లో ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.నార్త్ ఆడియన్స్ కు ఈ సినిమా కనెక్ట్ అయితే మాత్రం కలెక్షన్ల విషయంలో ఈ సినిమా మరిన్ని రికార్డులను క్రియేట్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి.రామ్ కు ఒక సినిమా హిట్టైతే వరుసగా మూడు సినిమాలు ఫ్లాప్ అవుతుండటం గమనార్హం.

అయితే బలమైన బ్యాగ్రౌండ్ ఉండటం వల్ల స్టార్ డైరెక్టర్లు రామ్ తో పని చేయడానికి తెగ ఆసక్తి చూపిస్తున్నారు.రామ్ సైతం మాస్ సినిమాలపై మాత్రమే కాకుండా మాస్ ప్రేక్షకులతో పాటు క్లాస్ ప్రేక్షకులకు నచ్చే సినిమాపై దృష్టి పెడితే బాగుంటుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.ఎనర్జిటిక్ స్టార్ రామ్ తర్వాత సినిమాలు స్టార్ డైరెక్టర్ల డైరెక్షన్ లో తెరకెక్కుతున్నాయి.రామ్ ను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య ఊహించని స్థాయిలో పెరిగింది.రామ్ తను హీరోగా తెరకెక్కే సినిమాల కోసం ఎంతగానో కష్టపడుతున్నారు.రామ్ పూరీ జగన్నాథ్ కాంబో మూవీ డబుల్ ఇస్మార్ట్ ( Double Ismart Movie )భారీ బడ్జెట్ తో, భారీ రేంజ్ లో తెరకెక్కుతోంది.

రామ్ రెమ్యునరేషన్ అంతకంతకూ పెరుగుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube