సెప్టెంబర్ 18వ తేదీన మన దేశ వ్యాప్తంగా కొన్ని ప్రాంతాలలో వినాయక చవితి( Vinayaka Chavithi ) ఉత్సవాలు మొదలయ్యాయి.అంతే కాకుండా వినాయక చవితి ఉత్సవాలకు పాలాజ్ గణపతి ఏ విధంగా ప్రసిద్ధి చెందిదో, సత్య గణపతి కూడా అదే విధంగా ప్రసిద్ధి చెందుతూ ఉంది.
జిల్లాలో ఎక్కడా లేని విధంగా డొంకేశ్వర్ లోని కర్రతో తయారు చేసిన ఏకదంతుడు ప్రతి సంవత్సరం విశేషా పూజలను అందుకుంటున్నాడు.అలాగే భక్తులు( devotees ) కోరిన కోరికలను తీరుస్తుండడంతో భక్తులు సత్య గణపతిగా( Satya Ganapati ) పిలుస్తున్నారు.
దీనికి సంబంధించి కమిటీ కూడా ఏర్పాటు చేశారు.ఇంకా చెప్పాలంటే కర్ర గణపతి గురించి కొన్ని విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
మహారాష్ట్ర సరిహద్దులో ఉన్న పాలాజ్ గణపతి ( Palaj Ganapathi )ఎంతో ప్రాముఖ్యతను కలిగి ఉంది.వినాయక చవితి రోజులలో మాత్రమే తెరిచే ఈ దేవాలయానికి( Temple ) సుదూర ప్రాంతాల నుంచి ఎంతోమంది భక్తులు తరలివస్తారు.అలాగే డొంకేశ్వర్ నుంచి కూడా ఎంతోమంది భక్తులు వస్తూ ఉంటారు.పాలాజ్ మాదిరిగా డొంకేశ్వర్ లో కూడా కర్ర గణపతి ఏర్పాటు చేయాలని ఆలోచన గోడి శరం నర్సారెడ్డికి వచ్చింది.
ఆయనకు వచ్చిన ఆలోచనను అందరితో పంచుకున్నాడు.అనుకున్న విషయాన్ని ఆలస్యం చేయకుండా ఊరంతా కలిసి కార్యానికి శ్రీకారం చుట్టారు.
గ్రామ జనాభా అందరూ విరాళాలు సేకరించిన డబ్బులు పోగు చేశారు.
అలా వచ్చిన డబ్బుతో నిర్మల్ జిల్లా సిద్దాపూర్ లోని జ్ఞానేశ్వర్ అనే కళాకారుడి వద్ద కర్ర గణపతిని తయారు చేయించారు.ఈ విగ్రహం తయారీలో మామిడి, తెల్ల జిల్లేడు, ఎర్రచందనం, రాగి చెక్కలను ఉపయోగించారు.అయితే 2018 సెప్టెంబర్ 13 నుంచి డొంకేశ్వర్ మండల కేంద్రంలోని సత్య గంగవ్వ మండపంలో విగ్రహాన్ని ప్రతిష్టించి ఉత్సవాలను మొదలుపెట్టారు.
ఐదో సంవత్సరం పూర్తి చేసుకోగా ఈ సంవత్సరం ఆరవ వార్షికోత్సవ వేడుక వేడుకలకు సిద్ధమయ్యారు.
LATEST NEWS - TELUGU