డైరెక్ట్ మినిస్ట‌ర్ బెర్త్ ! ఆమె ఎవ‌రో తెలుసా ?

ఏపీలో దివంగ‌త మంత్రి మేక‌పాటి గౌత‌మ్ రెడ్డి మ‌ర‌ణంతో మంత్రివ‌ర్గంలో ఖాళీ ఏర్ప‌డిన విష‌యం విధిత‌మే.మ‌రో ఆరు నెల‌ల్లో నెల్లూరు జిల్లా ఆత్మ‌కూరు నియోజ‌క‌వ‌ర్గానికి ఉప ఎన్నిక జ‌ర‌గ‌నుంది.

 Direct Minister Berth Do You Know Who She Is , Ap Political News Updates , Mek-TeluguStop.com

దీంతో ఆయ‌న స్థానంలో ఎవ‌రికి అవ‌కాశం ద‌క్క‌బోతుంద‌నే చ‌ర్చ కొన‌సాగుతోంది.అయితే ఉప ఎన్నిక‌కు ముందే గౌత‌మ్‌రెడ్డి స‌తీమ‌ణి శ్రీకిర్తిని మంత్రివ‌ర్గంలో చోటు ఇవ్వాల‌ని జ‌గ‌న్ భావిస్తున్నార‌ట‌.

కాగా మంత్రి కావాలంటే ముందు ఎమ్మెల్యే కావాలి.కానీ, త‌మ‌కు కావాల్సిన వారిని ముందుగా మంత్రిగా చేసి 6నెల‌ల కాలంలో ఏదైనా చ‌ట్ట‌స‌భ‌కు స‌భ్యులుగా ఎంపిక చేసీ అవ‌కాశం రాజ్యాంగం క‌ల్పించింది.

దీంతో మేక‌పాటి శ్రీకీర్తి ఎమ్మెల్యే కాకుండానే డైరెక్ట్ మంత్రి కాబోతున్నార‌ని తెలిసింది.

ఇక మేక‌పాటి కుటుంబానికి వైసీపీ అండ‌గా ఉంటుంద‌ని జ‌గ‌న్ ఇటీవ‌ల జ‌రిగిన గౌత‌మ్‌రెడ్డి సంస్మ‌ర‌ణ స‌భ‌లో హామీ కూడా ఇచ్చారు.

జ‌గ‌న్‌కు గౌత‌మ్‌రెడ్డి కూడా చిన్న‌నాటి స్నేహితుడు.దీంతో ఆయ‌న ఫ్యామిలీ నుంచే వార‌సులు రావాల‌ని ఆకాంక్షిస్తున్నారట‌.మ‌రోవైపు ఆత్మ‌కూరులో జ‌రిగే ఉప ఎన్నిక‌ల్లో కూడా శ్రీకీర్తిని నిల‌బెట్టాల‌ని యోచిస్తున్నార‌ట‌.ఉప ఎన్నిక జ‌రిగితే ఇక ఏక‌గ్రీవం కానుంద‌ని చెబుతున్నారు.

గౌత‌మ్ స‌తీమ‌ని నిల‌బ‌డితే టీడీపీ పోటీ పెట్ట‌దు.ఇక బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు అభ్య‌ర్థుల‌ను పెట్టినా పోటీ నామ‌మాత్ర‌మే అవుతుంది.

మొత్తంగా ఉప ఎన్నిక మీద కేంద్ర ఎన్నిక‌ల సంఘం నిర్ణ‌యం తీసుకోవాల్సి ఉంది.

Telugu Aatmakuru, Ap Ups, Cm Jagan, Congress, Mekapati, Mekapatigautam, Nellore,

కాగా ఈనెల 11న మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ ఉంది.ఈ విస్త‌ర‌ణ‌లో ఆమెతో ప్ర‌మాణ స్వీకారం చేయించేందుకు వైసీపీ హైకమాండ్ సిద్ధంగా ఉంద‌ని స‌మాచారం.ఉప ఎన్నిక‌కు ముందే ఆమెను మంత్రిగా చేసి మేక‌పాటి కుటుంబానికి భ‌రోసా ఇవ్వాల‌ని జ‌గ‌న్ భావిస్తున్నార‌ట‌.

ఇక నెల్లూరులో రెడ్డికి మంత్రి ప‌ద‌వి అవ‌కాశం ఉంటుందా ? ఉన్నా ఆమె ఎంపిక ఉంటుందా ? అంటే ఆమెకు ఛాన్స్ అని రాజ‌కీయ విశ్లేష‌కులు పేర్కొంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube