బాబు హడావుడి ... లోకేష్ పై విమర్శలు ?

ప్రస్తుతం టీడీపీ అధినేత చంద్రబాబు వయసు ఏడుపదులు దాటాయి.దీనికి తోడు కరోనా వైరస్ భయం ఒకవైపు, ఇంకో వైపు ఆరోగ్య సమస్యలు ఇలా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు.

 Tdp Leaders Coments On Lokesh Poltics, Tdp, Chandrababu, Ysrcp, Renugunta Nara L-TeluguStop.com

ఆయన విశ్రాంతి తీసుకోవాల్సిన సమయం వచ్చేసినా, ఇప్పటికి యాక్టివ్ గానే రాజకీయాలు చేస్తున్నారు.అధికారపార్టీ వైసీపీపై ఏదోరకంగా ఆందోళన నిర్వహిస్తూ, పార్టీ నాయకులతో సమావేశాలు నిర్వహిస్తూ, పరామర్శ, ప్రచార యాత్ర లో పాల్గొంటూ హడావుడి చేస్తున్నారు.2019 ఎన్నికల తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ పూర్తిగా తెలుగుదేశం పార్టీ ని టార్గెట్ చేసుకోవడం, ఆ పార్టీ నాయకుల పై కేసులు నమోదు చేయడం ఎలా అనేక వ్యవహారాలతో టిడిపి నాయకులు ఎక్కడికక్కడ సైలెంట్ అయిపోయారు.అనేకమంది ఇతర పార్టీలో చేరిపోయారు.

అయినా చంద్రబాబు మాత్రం ఎక్కడా కంగారు పాడడం లేదు.పార్టీని మళ్లీ అధికారంవైపు నడిపించే అంతటి సాహసం చేస్తూనే ఉన్నాడు.

ప్రస్తుతం టిడిపికి కాస్త ఆదరణ పెరిగినట్లుగా వివిధ సర్వేలు బయటకు వచ్చాయి.ఇదిలా ఉంటే నిన్న చిత్తూరు జిల్లాలోని రేణిగుంట విమానాశ్రయం చంద్రబాబు ను పోలీసులు అడ్డుకోవడం, దానికి నిరసనగా బాబు నేల పై కూర్చుని నిరసన వ్యక్తం చేయడం, దాదాపు నాలుగు గంటలు ఈ వ్యవహారం నడిచింది.

ఇది మీడియా, సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.చంద్రబాబు ఈ వయసులోనూ ఇంతగా కష్టపడుతున్నారనే సింపతి సైతం వచ్చింది.ఈ సందర్భంగా ఆయన తనయుడు, భవిష్యత్తులో టిడిపి పగ్గాలు చేతబట్టి, పార్టీని ముందుకు నడిపించాల్సిన లోకేష్ వ్యవహారంపైనా చర్చ జరిగింది.

Telugu Chandrababu, Jagan, Ysrcp-Telugu Political News

రేణిగుంట విమానాశ్రయంలో ఈ తరహా పరిణామం జరుగుతుందని ముందుగా తెలిసినా లోకేష్ ఆయన వెంట ఎందుకు వెళ్లలేదని ? అసలు చంద్రబాబు ఈ వయసులో పార్టీ కోసం కష్టపడుతున్న, లోకేష్ ఎందుకు బాబు తాపత్రయాన్ని అర్థం చేసుకోలేకపోతున్నారు అని , ఇప్పుడు పార్టీ ఉన్న పరిస్థితుల్లో యాక్టివ్ గా లోకేష్ రాజకీయాలు చేయకపోతే తీవ్రంగా నష్టపోతాం అనేది లోకేష్ ఎందుకు గ్రహించలేకపోతున్నారు అనే ప్రశ్నలు ఎన్నో బయటకి వస్తున్నాయి.

చంద్రబాబు వయసు పెరుగుతున్నా, పార్టీ కోసం, లోకేష్ కోసం ఇంత కష్టపడుతున్నా, లోకేష్ మాత్రం తన పనితీరును మార్చుకోవడం లేదని, కేవలం వారసుడిగా రాజకీయ ఎంట్రీ ఇచ్చిన ఆయన ఇప్పటికీ తన పనితీరు మెరుగుపరుచుకోకుండా, కేవలం సోషల్ మీడియా ద్వారా మాత్రమే రాజకీయాలు చేస్తూ, పరామర్శల యాత్రలు చేస్తూ ఉంటే లాభం ఏంటి అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.ఏదిఏమైనా చంద్రబాబు యాక్టివ్ పాలిటిక్స్ చేయడం లోకేష్ తన పనితీరు మార్చుకోకపోవడం తో ఈ సెటైర్లు పడడానికి కారణం అవుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube