రామ్ కెరీర్లోనే బెస్ట్ ఇస్మార్ట్ బిజినెస్!

యువ హీరో రామ్ - పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో తెరకెక్కిన ఇస్మార్ట్ శంకర్ మరికొన్ని రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

అయితే ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ ఆడియెన్స్ లో మరింత అంచనాలను రేపెలా ఉంది.

ఎందుకంటే ఎప్పుడు లేని విధంగా రామ్ కెరీర్ లో మొదటిసారి 35కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ జరుగుతోంది.

నైజాంలో పూరి జగన్నాథ్ సినిమాలకు ముందు నుంచి సాలిడ్ మార్కెట్ ఉంది.ఆ క్రేజ్ తో రామ్ సినిమా 7.20కోట్లకు అమ్ముడైంది.ఇక ఆంధ్రా రీజియన్ ఏరియాల్లో 6.50కోట్లు.సీడెడ్ లో 3.33కోట్లకు డీల్ సెట్టయింది.అలాగే కర్ణాటకలో 1.50కోట్లు.రెస్ట్ ఆఫ్ ఇండియా చూసుకుంటే 60లక్షల వరకు సినిమా బిజినెస్ చేసినట్లు సమాచారం.

ఈ విధంగా థ్రియేటికల్ డిస్ట్రిబ్యూషన్ రైట్స్ 17కోట్లకు తాకింది.

Advertisement

ఫైనల్ గా మిగతా బిజినెస్ లతో కలుపుకొని ఇస్మార్ట్ శంకర్ ప్రీ రిలీజ్ బిజినెస్ 36.18కోట్లకు చేరింది.ఈ లెక్కలెప్పుడు రామ్ కెరీర్ లో ఇంతవరకు కనిపించలేదు.

సినిమాపై ట్రైలర్స్ అండ్ సాంగ్స్ మంచి బజ్ క్రియేట్ చేయడంతో మాస్ ఆడియెన్స్ ని సినిమా ఎక్కువగా ఆకర్షిస్తోంది.

Advertisement

తాజా వార్తలు