మెడికల్ షాప్ పెట్టాలనుకుంటున్నారా... అయితే ప్రభుత్వమే సాయం చేస్తుంది!

అవును, మెడికల్ షాప్స్( Medical Shops ) నిర్వహించాలనుకొనేవారికి ఇది మంచి తరుణమని చెప్పుకోక తప్పదు.అసలు విషయం అందరికీ తెలిసే వుంటుంది.

 Pradhan Mantri Jan Aushadhi Yojana Scheme Details,medical Devices, Medical Shop,-TeluguStop.com

కేంద్ర ప్రభుత్వం జన్ ఔషధి కేంద్ర పథకం ద్వారా మెడికల్ షాపుల్ని తెరుస్తోంది.కాగా ఈ మెడికల్ షాపుల్లో ప్రజలకు అత్యంత తక్కువ ధరకే మెడిసిన్స్ లభించనున్నాయి.

ఇటీవల స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ( Prime Minister Narendra Modi ) దేశవ్యాప్తంగా 25,000 జన్ ఔషధి కేంద్రాలను తెరుస్తామని ప్రకటించారు.జన్ ఔషధి కేంద్రాలు దేశంలోని మధ్యతరగతి ప్రజలకు కొత్త బలాన్ని అందిస్తోందని, వారికి రూ.20,000 కోట్లు ఆదా అవుతోందని మోదీ అన్నారు.

Telugu Central, Jan Aushadhi, Medical, Medical Shop, Pradhanmantri-Latest News -

ప్రస్తుతం 10,000 జన్ ఔషధి కేంద్రాలు ఉంటే వాటిని 25,000 కేంద్రాలకు పంచుతామని ఈ సందర్బంగా చెప్పుకొచ్చారు మోడీ.ఈ నేపధ్యంలో వారి గురించిన కొన్ని మాటలు చెప్పుకొచ్చారు.జన్ ఔషధి కేంద్రాలు( Jan Aushadhi ) మధ్యతరగతి ప్రజలకు ప్రత్యేక శక్తిని ఇచ్చాయన్నారు.మధుమేహం ఉన్నట్లు నిర్ధారణ అయితే నెలవారీ బిల్లు రూ.3000 జమ అవుతుందని, ఈ జన్ ఔషధి కేంద్రాల ద్వారా రూ.100 విలువైన మెడిసిన్స్‌ని కేవలం రూ.10 నుంచి రూ.15 ధరకే లభిస్తాయని మోదీ అన్నారు.ప్రధాన మంత్రి భారతీయ జన్ ఔషధి స్కీమ్( Pradhan Mantri Bhartiya Janaushadhi Pariyojana ) ద్వారా ఈ కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు అవకాశం ఇస్తోంది కేంద్ర ప్రభుత్వం.

Telugu Central, Jan Aushadhi, Medical, Medical Shop, Pradhanmantri-Latest News -

కాగా ఈ స్కీమ్ 2014-15 ఆర్థిక సంవత్సరంలో ప్రారంభమైంది.జన్ ఔషధి కేంద్రాల్లో మందులు బయటి మార్కెట్‌తో పోలిస్తే 50 శాతం నుంచి 90 శాతం తక్కువకే లభిస్తాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు.ప్రధాన మంత్రి మోదీ చెప్పినట్టు రూ.100 విలువైన మెడిసిన్స్‌ని కేవలం రూ.15 లోపే లభిస్తాయి.దాంతో సామాన్యుల పట్ల ఈ నిర్ణయం ఓ వరంలాగా మారానుంది.

ఫార్మాసూటికల్స్ అండ్ మెడికల్ డివైజెస్ బ్యూరో ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో 1800 పైగా మందులు, సర్జికల్ డివైజ్‌లు, న్యూట్రాసూటికల్, ఆయుష్ ప్రొడక్ట్స్, సువిధ శానిటరీ ప్యాడ్స్ జన్ ఔషధి కేంద్రాల్లో లభిస్తాయి.ఇక వీటిని నిర్వహించాలనుకొనే వారు డీఫార్మసీ, ఫార్మాసీ పూర్తి చేసినవారు అయి వుండాలి.అదేవిధంగా ఏర్పాటు చేయడానికి కనీసం 120 చదరపు అడుగుల స్థలం, నాన్ రీఫండబుల్ అప్లికేషన్ ఫీజు రూ.5,000 చెల్లించాలి.కేంద్ర ప్రభుత్వం ప్రోత్సాహకాలు, ఆర్థిక సహకారం కూడా ఇస్తుంది.బ్యూరో ఆఫ్ ఫార్మా పీఎస్‌యూస్ ఆఫ్ ఇండియా నుంచి రూ.2.50 లక్షల వరకు ఆర్థిక సహకారం లభిస్తుంది.ఈ జన్ ఔషధి కేంద్రాలను ఏర్పాటు చేయాలని అనుకున్నవారు https://janaushadhi.gov.in/ వెబ్‌సైట్ సందర్శించండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube