నేడు ఇండియా కూటమి కోఆర్డినేషన్ కమిటీ తొలి భేటీ

దేశంలోని ప్రతిపక్ష పార్టీలన్నీ కలిసి ఏర్పాటు చేసిన ఇండియా కూటమి కోఆర్డినేషన్ కమిటీ తొలిసారిగా భేటీ కానుంది.ఈ మేరకు ఎన్సీపీ నేత శరద్ పవార్ ఢిల్లీలోని నివాసంలో ఈ సమావేశాన్ని నిర్వహించనున్నారు.

 Today Is The First Meeting Of India Alliance Coordination Committee-TeluguStop.com

ఇందులో ప్రధానంగా 2024 లోక్ సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, సీట్ల పంపకాలు వంటి పలు కీలక అంశాలపై సమన్వయ కమిటీ చర్చించనుందని తెలుస్తోంది.దాంతోపాటు ఇండియా కూటమి భవిష్యత్ కార్యాచరణపై కూడా ఈ సమావేశంలో నేతలు చర్చించనున్నారు.

అయితే వివిధ పార్టీలకు చెందిన సుమారు పద్నాలుగు మంది నాయకులతో సమన్వయ కమిటీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.కాగా ఈ కమిటీ ఇండియా కూటమిలో అత్యున్నత విధాన నిర్ణాయక విభాగంగా పని చేస్తుందన్న విషయం తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube