వినాయక చవితి గురించి కీలక అప్డేట్ ఇచ్చిన కాణిపాకం దేవాలయం..!

మన భారతదేశంలో దాదాపు చాలా మంది ప్రజలు ఏ పండుగనైనా తమ కుటుంబ సభ్యులందరితో కలిసి ఎంతో సంతోషంగా జరుపుకుంటారు.అలాగే మన దేశంలోని ప్రజలు ఎన్నో ఆచారాలను, సంప్రదాయాలను కూడా పాటిస్తూ ఉంటారు.

 Kanipakam Varasiddhi Vinayaka Temple On Vinayaka Chavithi 2023 Date,kanipakam Va-TeluguStop.com

కానీ ప్రస్తుత సమాజంలో ఏ పండుగ( Hindu Festivals ) వచ్చినా అది ఏ రోజు నిర్వహించుకున్నాలనే దాని పై సందిగ్ధత ఏర్పడుతూ ఉంది.ముఖ్యంగా చెప్పాలంటే పండితులు, అర్చకుల లోనూ దీని పై భిన్నాభిప్రాయాలు ఉంటున్నాయి.

కొందరు పండుగను ఈ తిధిలో నిర్వహించుకోవాలి.అంటే లేదు గడియలు కూడా కీలకమే అని మరికొందరు వాదిస్తున్నారు.

అయితే ఈ నెలలో రాబోతున్న వినాయక చవితి( Vinayaka Chaturthi ) విషయంలోనూ ఇదే జరుగుతుందని కొంత మంది ప్రజలు చెబుతున్నారు.ఈ నెల 18వ తేదీన వినాయక చవితి నిర్వహించాలని కొంత మంది చెబుతూ ఉంటే, లేదు 19వ తేదీన నిర్వహించాలని మరి కొందరు చెబుతున్నారు.అయితే వినాయక చవితి పండుగ జరుపుకునే డేట్ పై కాణిపాకం దేవాలయ అర్చకులు( Kanipakam Temple ) క్లారిటీ ఇచ్చారు.ముఖ్యంగా చెప్పాలంటే ఈ నెల 18వ తేదీన వినాయక చవితి నిర్వహించుకోవాలని కాణిపాకం వరసిద్ధి వినాయక దేవాలయ అర్చకులు చెబుతున్నారు.

అయితే వినాయక చవితి( Vinayaka Chaturthi Festival Date ) జరుపుకునే తేదీ గురించి అనేక రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి.ఈ ఏడాది భాద్రపద శుద్ధి చవతి ఈ నెల 18వ తేదీన సోమవారం రోజు ఉదయం 10.15 నిమిషముల నుంచి మరుసటి రోజు ఉదయం 10:43 నిమిషముల వరకు ఉంటుంది.అంటే 18వ తేదీన రాత్రి మాత్రమే చవతి తిధి ఉంది.

ఆ తిథి ప్రకారం కాణిపాకం లో బ్రహ్మోత్సవాలు ఈ నెల 18వ తేదీ నుంచి మొదలు అవుతాయి.అలాగే ఈ నెల 18వ తేదీ నుంచి 21 రోజుల పాటు కాణిపాకంలో బ్రహ్మోత్సవాలు( Kanipakam Brahmotsavam ) నిర్వహిస్తామని కాణిపాకం వరసిద్ధి వినాయక దేవాలయం ప్రధాన వేద పండితులు ప్రకటించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube