Bigg Boss 7: బిగ్ బాస్ సీజన్ 7 కోసం ఎవరు ఎంత రెమ్యూనరేషన్ అందుకుంటున్నారు ?

బిగ్ బాస్-7( Bigg Boss 7 ) ప్రారంభమైన విషయం తెలిసిందే.మరోసారి నాగార్జున( Nagarjuna ) హోస్ట్ గా చేస్తుండగా.

 Bigg Boss 7 Telugu Season Contestants Remunerations Sivaji Shoba Shetty Pallavi-TeluguStop.com

హీరో శివాజీతో( Hero Sivaji ) పాటు పలవురు యూట్యూబర్లు కంటెస్టెంట్లుగా ఉన్నారు.అలాగే షకీలా( Shakeela ) కూడా ఈ సారి బిగ్ బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టింది.

కంటెస్టెంట్లు తొలి రోజు నుంచే టాస్క్ లు చేస్తూ ప్రేక్షకులకు ఎంటర్‌టైన్మెంట్ అందిస్తున్నారు.దీంతో ఇప్పుడు బిగ్ బాస్ ను చాలామంది చూస్తున్నారు.

అయితే బిగ్ బాస్ కంటెస్టెంట్ల గురించి ఇప్పుడు జోరుగా చర్చ జరుగుతోంది.ఈ క్రమంలో వారి రెమ్యూనరేషన్ల గురించి ఒక వార్త సోషల్ మీడియాలో చర్చకు దారి తీసింది.

Telugu Bigg Boss, Gautam Krishna, Sivaji, Priyanka Jain, Rithika Rose, Shakeela,

బిగ్ బాస్-7 లోఎవరి రెమ్యూనరేషన్ ఎంత అనేది ఒక వార్త వైరల్ గా మారింది.సీరియల్ నటుడిగా పాపులర్ అయిన అమర్ దీప్‌కు( Amardeep ) ఎంతోమంది అభిమానులు ఉన్నారు.అలాగే సోషల్ మీడియాలో కూడా అతడికి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.దీంతో అతడికి వారానికి రూ.2.5 లక్షల రెమ్యూనరేషన్ ఇస్తున్నారు.ఇక టాలీవుడ్ కొరియోగ్రాఫర్ అయిన ఆట సందీప్‌కు( Aata Sandeep ) కూడా వారానికి రూ.2.5 లక్షల రెమ్యూనరేషన్ ఇస్తున్నారు.అలాగే తెలుగు గాయని దామనికి వారానికి రూ.2 లక్షలు ఫిక్స్ చేశారు.అలాగే అనేక సినిమాల్లో కీలక పాత్రలు పోషించిన గౌతమ్ కృష్ణకు వారానికి రూ.1.5 లక్షలు రెమ్యూనరేషన్ ఇస్తున్నారు.

Telugu Bigg Boss, Gautam Krishna, Sivaji, Priyanka Jain, Rithika Rose, Shakeela,

అలాగే రైతు బిడ్డగా బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చిన పల్లవి ప్రశాంత్ కు( Pallavi Prasanth ) వారానికి రూ.లక్ష, ఇక తొలి కంటెస్టెంట్ గా హౌస్ లోకి అడుగుపెట్టిన ప్రియాంక జైన్ కు( Priyanka Jain ) వారానికి రూ.2.5 లక్షలు తీసుకుంటున్నారు.ఇక రతికా రోజ్ కు రూ.1.75 లక్షలు, ఇస్తున్నారు.ఇక షకీలాకు అత్యధికంగా వారానరికి రూ.3.75 లక్షల రెమ్యూనరేషన్ ఇస్తున్నారు.ఇక కార్తీక దీపం ద్వారా పాపులర్ అయిన శోభా శెట్టికి( Sobha Shetty ) రూ.2 లక్షలు, నటుడు శివాజీకి రూ.3 లక్షలు, శుభశ్రీ రాయగురుకు రూ.2 లక్షలు ఇస్తున్నారు.అలాగే టేస్టీ తేజకు రూ.1.7 లక్షలు ఇస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube