ఈ మద్య అధికార బిఆర్‌ఎస్ లో ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు( MLA Mynampally Hanumantha Rao ) పేరు గట్టిగా వినిపిస్తోంది.తనకు తన కుమారుడికి టికెట్ ఇవ్వాలని ఇకపోతే పరిస్థితులు వేరేలా ఉంటాయని హాట్ హాట్ కామెంట్స్ తో ఒక్కసారిగా మీడియాలో హైలెట్ అయ్యారు.
అంతేకాకుండా మంత్రి హరీష్ రావు ను ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయ వర్గాల్లో పెను దుమరాన్ని రేపిన సంగతి తెలిసిందే.హరీష్ రావు బట్టలు ఉదడిస్తానని, తనకు అవకాశమిస్తే హరీష్ రావును ఒడిస్తానని ఇలా రకరకాల వ్యాఖ్యలతో ఒక్కసారిగా విభేదాలను బయట పెట్టారు మైనంపల్లి.
దీంతో కేసిఆర్( CM KCR ) టికెట్ ఇస్తారా లేదా అనే సందేహాలు వ్యక్తమయ్యాయి.ఒకవేళ టికెట్ ఇవ్వకపోతే పార్టీ మారే ఆలోచన కూడా మైనంపల్లి చేశారు.అయితే ఎవరు ఊహించని విధంగా మల్కాజ్ గిరి టికెట్ ను మైనంపల్లికే కేటాయించారు గులాబీ గస్.దీంతో అభ్యర్థుల ప్రకటనకు ముందు ధూమ్ ధాం అంటూ హడావిడి చేసిన మైనంపల్లి మొదటి లిస్ట్ తన పేరు ఉండడంతో సైలెంట్ అయ్యారు.అయితే ఇంతవరుకు బాగానే ఉన్నప్పటికి తన కుమారుడికి మేదక్ అసెంబ్లీ సీట్ ఆశించారు మైనంపల్లి.కానీ ఆ స్థానం సిట్టింగ్ ఎమ్మెల్యే పద్మ దేవేందర్( Padma Devender Reddy ) కు కేటాయించారు.
అయితే తన తనయుడికి సీటు దక్కకపోవడం వెనుక మంత్రి హరీష్ రావు ఉన్నడానేది మైనంపల్లి వర్గీయులు చేస్తున్న ఆరోపణ.
అయితే తనకు మల్కాజ్ గిరి సీటు దక్కినప్పటికి మైనంపల్లి పెద్దగా హ్యాపీగా లేరనేది ఇంటర్నల్ గా వినిపిస్తున్న మాట.దీంతో తన కుమారుడిని ఇండిపెండెంట్ గా పోటీ చేయించే ఆలోచనలో మైనమపల్లి ఉన్నారట.ఇదే గనుక జరిగితే బిఆర్‌ఎస్ కు గట్టి షాక్ తగలడం ఖాయం.
అయితే పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే పార్టీ నుంచి సస్పెండ్ చేస్తామని కేసిఆర్ గతంలోనే సిట్టింగ్ ఎమ్మెల్యేలను ఉద్దేశించి హెచ్చరించిన సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో మైనంపల్లి తన కుమారుడిని ఇండిపెండెంట్ గా నిలబెడితే మల్కాజ్ గిరి( Malkajgiri ) టికెట్ మైనంపల్లికి క్యాన్సిల్ చేసే అవకాశం కూడా లేకపోలేదు మొత్తానికి మైనంపల్లి కారణంగా మెదక్ జిల్లాలో రాజకీయాలు హాట్ హాట్ గా సాగుతున్నాయి.