గన్నవరం పై జగన్ స్పెషల్ ఫోకస్ ! అలక వీడిన ఆ నేత 

గత కొంతకాలంగా గన్నవరం నియోజకవర్గంలో వైసీపీ ( YCP party )శ్రేణులు మధ్య విభేదాలు బయటపడిన సంగతి తెలిసిందే ముఖ్యంగా ఈ నియోజకవర్గంలో మూడు గ్రూపులుగా పార్టీ విడిపోయింది.వైసీపీ నుంచి టీడీపీకి అనుబంధంగా కొనసాగుతున్న ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ,  యార్లగడ్డ వెంకట్రావు, దుట్టా రామచంద్రరావు ల మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతూనే ఉంది.

 Jagan's Special Focus On Gannavaram! That Leader Who Left The Wave, Jagan, Ysrc-TeluguStop.com

ముఖ్యంగా వంశీ నాయకత్వాన్ని వెంకట్రావు, రామచంద్ర రావు తీవ్రంగా వ్యతిరేకిస్తూనే వస్తున్నారు.ఈ క్రమంలో వంశీకి వైసిపి టికెట్ ఖరారు కావడంతో అలక చెందిన యర్లగడ్డ వెంకట్రావు టిడిపిలో చేరేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

రామచంద్రరావు సైతం వైసీపీకి రాజీనామా చేసే పరిస్థితులు ఏర్పడడంతో, ఈ నియోజకవర్గాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న వైసీపీ అధినేత, ఏపీ సీఎం జగన్ ( CM jagan )ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు.ఈ మేరకు దుట్టా రామచంద్రరావు ( Dutta ramachandar Rao )కుటుంబాన్ని పిలిపించుకుని బుజ్జగించారు.

Telugu Ap Cm Jagan, Ap, Chandrababu, Jagan, Ysrcp-Politics

పార్టీని వీడకుండా చేయడంలో జగన్ సక్సెస్ అయ్యారు. వైసీపీ నేతలు ఎవరూ టిడిపిలోకి వెళ్లకుండా ప్రత్యేకంగా దృష్టి సారించారు.చాలాకాలంగా దుట్టా రామచంద్రరావు ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ( Vallabhaneni Vamsi )పై ఆగ్రహంగా ఉన్నారు.యార్లగడ్డ వెంకట్రావు వెంట ఆయన టిడిపిలోకి వెళ్తారనే సంకేతాలతో రంగంలోకి దిగిన జగన్ దుట్టా రామచంద్రరావు కుటుంబంతో నిన్న ప్రత్యేకంగా భేటీ అయ్యారు.

అనంతరం మీడియాతో మాట్లాడిన రామచంద్ర రావు తాము ఎల్లప్పుడూ వైసిపి లోనే ఉంటామని,  జగన్ వెంట నడుస్తామని ప్రకటించారు.గన్నవరం నియోజకవర్గ కార్యకర్తలు ఎవరు అధైర్య పడవద్దని,  మంచి రోజులు వస్తాయని , రాబోయే రోజుల్లో పార్టీని మరింత బలోపేతం చేద్దామని వైఎస్ జగన్ గెలిపించుకుందామని రామచంద్రరావు పిలుపునిచ్చారు.

Telugu Ap Cm Jagan, Ap, Chandrababu, Jagan, Ysrcp-Politics

వైఎస్సార్ కుటుంబంతో తమ కుటుంబానికి 45 ఏళ్ల నుంచి అనుబంధం ఉందని,  తాము ఎప్పటికీ పార్టీని వీడేది లేదని,  పార్టీ మారే ఆలోచన రాదు అని అన్నారు.గన్నవరంలోని మన పార్టీ , కుటుంబంలోని ప్రతి కార్యకర్తకు తాము అండగా ఉంటామని,  నాయకులు వస్తుంటారు పోతుంటారు మీరు ఎవరు అధైర్య పడవద్దని , పార్టీలో ఎవరు ఉన్నా లేకున్నా మన పార్టీ వైసీపీనేనని  క్లారిటీ ఇచ్చారు.దీంతో వైసీపీకి ఈ నియోజకవర్గంలో తలనొప్పులు తగ్గినట్లు అయింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube