'ఖుషి' స్టార్స్ డాన్స్ పై సోషల్ మీడియాలో ట్రోల్స్‌

విజయ్ దేవరకొండ హీరోగా సమంత హీరోయిన్ గా నటించిన ఖుషి సినిమా( Kushi Movie ) మరో రెండు వారాల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.సెప్టెంబర్‌ 1న విడుదల కాబోతున్న ఖుషి సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా సమంత మరియు విజయ్ దేవరకొండ స్టేజ్ పై డాన్స్ చేసిన విషయం తెల్సిందే.

 Vijay Deverakonda And Samantha Stage Show Trolls,vijay Deverakonda,samantha,kush-TeluguStop.com

ఈ మధ్య కాలంలో హీరో, హీరోయిన్‌ ఎవరు కూడా స్టేజ్ పై ఇలా ప్రమోషనల్ కార్యక్రమం కోసం డాన్స్ చేసిన దాఖలాలు లేవు.ఖుషి సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్( Kushi Movie Pre Release Event ) లో వీరి సందడి ఎలా ఉంటుందో అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఖుషి మ్యూజిక్ షో( Kushi Music Show ) తో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన మేకర్స్‌ ప్రస్తుతం సినిమా పై అంచనాలు భారీగా పెంచేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు.అందులో భాగంగానే సమంత మరియు విజయ్ దేవరకొండ లైవ్ డాన్స్ షో( Samantha Vijay Deverakonda Live Dance ) అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.సినిమా ప్రమోషన్ కోసం వీరు చేసిన పని ఓవర్‌ యాక్షన్ అంటూ కొందరు కామెంట్స్ చేస్తూ ఉంటే మరి కొందరు మాత్రం ఇలాంటి షో ఎంత వరకు కరెక్ట్ అంటూ ప్రశ్నిస్తున్నారు.సినిమాల్లో అయితే పర్వాలేదు కానీ అలా బనియన్ పై విజయ్ దేవరకొండ, నడుము చూపిస్తూ సమంత ఇంత షో చేయడం అవసరమా అంటూ కొందరు ప్రశ్నిస్తుంది.

తెలుగు సినిమా ఇండస్ట్రీ( Tollywood ) లో ఇలాంటి హడావుడి ని తక్కువగా చూస్తూ ఉంటాం.వీరు ఇద్దరు కావాలని ఎవరినో కవ్వించేందుకు ఇలాంటివి చేస్తున్నారు అంటూ విమర్శలు వస్తున్నాయి.ఇప్పటికే ఖుషి సినిమా కథ విషయంలో రకరకాలుగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి.ఇలాంటి సమయంలో వీరి డాన్స్ షో ఆ అనుమానాలకు, పుకార్లకు మరింత ఆజ్యం పోసినట్లు అయిందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube